Home > సినిమా > త్వరలో స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి..?

త్వరలో స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి..?

త్వరలో స్టార్ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి..?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలో పెళ్లి చేసుకోనునట్లు సమాచారం. నాలుగు పదుల వయస్సు దాటిన ఈ స్వీటీ గతంలో రెబల్ స్టార్ ప్రభాస్‌తో రిలేషన్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈమె ఓ స్టార్ క్రికెటర్‌‌ను వివాహం చేసుకోనున్నట్లు నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.వీరి ఇరు వర్గాలు కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పినట్లు టాక్. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది కలల ప్రపంచం అని అందరికీ తెలుసు. కెరీర్‌ ప్రధానంగా సాగే ఈ రంగంలో చాలామంది వయసు పెరుగుతునప్పటికీ పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల విషయంలో తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇటీవల రష్మిక- విజయ్ ఎంగేజ్‌మెంట్‌ అంటూ పెద్దఎత్తున రూమర్స్‌ వచ్చాయి. అలాంటిదేమీ లేదంటూ విజయ్ టీం క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాజాగా మరో టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌పై త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్‌ తెగ వైరలవుతోంది.

బాహుబలి’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే 40 ఏళ్లు దాటిపోయినా ఇంకా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. గతంలో పలు రూమర్స్ వచ్చినప్పటికీ అవి నిజం కాలేదు.కథానాయికగా అనుష్క శెట్టి. మొదట్లో అందాలు బాగానే ఆరబోసినా, ఆ తర్వాత ‘జేజమ్మ’, ‘రుద్రమదేవి’, ‘దేవసేన’, ‘భాగమతి’ వంటి పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా భారీ ఫ్యాన్​ ఫాలోయింగ్​ను పెంచుకున్నారు. ఇంకా చెప్పాలంటే లేడి ఓరియెంటెండ్​ సినిమా అనగానే.. అనుష్క పేరు గుర్తొచ్చేలా తన నటనతో ప్రేక్షకుల్ని మాయ చేశారు. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం ద్వారా పలకరించింది. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమాలో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించి అలరించింది. అయితే ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు ఆమెపై రూమర్స్ కూడా వచ్చాయి. అవీ వాటిలో ఎలాంటి నిజం లేదని తెలిసిపోయింది.

Updated : 30 Jan 2024 7:17 PM IST
Tags:    
Next Story
Share it
Top