Home > సినిమా > 'Miss Shetty Mr. Polishetty' : ఓటీటీలో 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'..అఫీషియల్ అనౌన్స్‎మెంట్

'Miss Shetty Mr. Polishetty' : ఓటీటీలో 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'..అఫీషియల్ అనౌన్స్‎మెంట్

Miss Shetty Mr. Polishetty : ఓటీటీలో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి..అఫీషియల్ అనౌన్స్‎మెంట్
X

చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క నటించిన మూవీ 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించింది. ఎన్నోసార్లు పోస్ట్‎పోన్ అవుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు సెప్టెంబర్‌ 7న బిగ్ స్క్రీన్ మీద సందడి చేసింది. మహేశ్‌బాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో యంగ్ డైనమైట్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా ఇరగదీశాడు. నాజర్‌, మురళీ శర్మ, జయసుధ, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి కీలక పాత్రల్లో కనిపించారు. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి విడుదల అయినప్పటి నుంచి పాజిటీవ్‌ టాక్‌తో ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అనుష్కకు హిట్ అందించింది.



తాజాగా మేకర్స్ మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఓటీటీ రిలీజ్ డేట్‎ను అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‎ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 5న స్ట్రీమింగ్‌ కానుంది. మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాకు తొలి ప్రేక్షకుడిని నేనే అంటూ మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో తెలిపారు. సినిమా సూపర్‎గా ఉందని ఆయన అన్నారు. దీంతో సినిమాకు స్టార్టింగ్ నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సమంత కూడా ఈ మూవీపై పాజిటివ్‌గానే స్పందించారు. నవీన్‌ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ కంటే డబుల్ ఎంటర్టైన్మెంట్‎ను ఈ మూవీలో అందించాడు. అంతే కాదు చాలా అందంగా కూడా కనిపించాడు.




Updated : 30 Sept 2023 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top