Home > సినిమా > అనుష్కను 'ఘాటి' ఎక్కిస్తోన్న క్రిష్

అనుష్కను 'ఘాటి' ఎక్కిస్తోన్న క్రిష్

అనుష్కను ఘాటి ఎక్కిస్తోన్న క్రిష్
X

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అనుష్క. గత కొంత కాలంగా స్వీటీ సైలెంట్‌గా ఉంటోంది. చేతినిండా సినిమాలో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏడాదికి ఓ సినిమా మాత్రమే చేస్తోంది. లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు ఈ భామ మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మధ్యనే ఆ మూవీ పట్టాలెక్కింది. అనుష్క మళ్లీ నెక్ట్స్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ టైంలోనే స్వీటీ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చింది.

తాజాగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ బ్యూటీ సినిమా చేస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘ఘాటీ' అనే టైటిల్‌ను ఖరారు ఫిక్స్ చేశారు. అమెజాన్ సంస్థ ఈ మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేసింది. అనుష్క ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే స్వీటీ ఫేస్‌ను రివీల్ చేయలేదు. ఫస్ట్ లుక్‌లో అనుష్క చీర కట్టుకుని తలపై ముసుగు వేసుకుని నడుస్తూ వెళ్తున్నట్లు చూపించారు.

నేరస్తురాలిగా మారిన ఓ బాధితురాలిగా ఇందులో అనుష్క కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ మూవీ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే విషయాలను ప్రకటించలేదు. ఏదేమైనా ఇన్నాళ్లకు అనుష్క మూవీ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Updated : 20 March 2024 11:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top