Home > సినిమా > ఆడవాళ్లకు అనుష్క స్పెషల్ గిఫ్ట్..

ఆడవాళ్లకు అనుష్క స్పెషల్ గిఫ్ట్..

ఆడవాళ్లకు అనుష్క స్పెషల్ గిఫ్ట్..
X

ఛానాళ్ల గ్యాప్ తరువాత అనుష్క"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" సినిమాతో వెండితెరపైన సందడి చేస్తోంది. మహేష్ బాబు డైరెక్షన్‎లో యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టితో స్వీటీ కలిసి నటించిన ఈ చిత్రం మంచి హిట్ టాక్‏ను సొంతం చేసుకుంది. మౌత్ పబ్లిసిటీతో రోజురోజుకీ ఈ మూవీకీ బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని థియేటర్లలో జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ముందు అనుష్క మూవీ రాక్ సాలిడ్‎గా నిలబడింది. ఓవర్సీస్‎లోనూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది.

తమ సినిమాని ఇంత హిట్ చేసినందుకుగాను అనుష్క మహిళల కోసం ఓ స్పెషల్ గిఫ్ట్‎ని ప్లాన్ చేసింది. ఈ గురువారం రెండు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫ్రీ మార్నింగ్ షో ను వేయబోతున్నట్లు అనుష్కనే స్వయంగా అనౌన్స్ చేసింది. ఈ బంపర్ ఆఫర్‎ను మహిళలంతా వినియోగించుకుకోవాలని అనుష్క స్వయంగా కోరింది. ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కలిసి థియేటర్స్‎కి రావాలంటూ ఓ వీడియోను అనుష్క తన ట్విటర్ అకౌంట్లలో షేర్ చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుష్క ఆఫర్‏కు మహిళలు ఫుల్ ఖుష్ అవుతున్నారు.


It is heart warming to see all your love and response to ms shetty mr polishetty.. means the world to us …🤗🧿🙏🏻🤗

Updated : 12 Sep 2023 10:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top