Home > సినిమా > రవితేజ సినిమా టీజర్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం

రవితేజ సినిమా టీజర్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం

రవితేజ సినిమా టీజర్‌పై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం
X

టాలీవుడ్ స్టార్ హీరో మాస్‌ మహరాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. ఈ సినిమాలో రవితేజ స్టువర్ట్‎పురం దొంగ టైగర్ నాగేశ్వరరావుగా కనిపించనున్నాడు. జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటలు ఆధారంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు ప్రొడ్యూజర్లు. అయితే ఈ సినిమా రిలీజ్‎కు ముందే వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‎లో స్టువర్ట్‎పురంలో ఉండే గిరిజనులను దొంగలుగా చూపించారని,తమ గ్రామాన్ని ఓ నేర గ్రామంగా చిత్రీకరించారని అభ్యంతరకరమైన పదాజాలంతో అవమానించారని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఏపీ సినిమాటోగ్రఫి కమిషనర్‎కి, ఏపి డిజిపికి ఈ సినిమా నిర్మాణాన్ని వెంటనే ఆపాలంటూ ఉత్తరాలు కూడా రాశారు. హైకోర్టులో సైతం కేసులు వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా హైకోర్టు కూడా టైగర్ నాగేశ్వరరావుపై తీవ్ర అభ్యంతరాన్ని తెలిపింది. చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‎కు నోటీసులు పంపింది.

" రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా టీజర్‌లో వాడిన పదాలు స్టువర్టుపురం ప్రాంత వాసులను అవమానించేవిగా ఉన్నాయి. సెంట్రల్‌ బోర్డు ఫిల్మ్‌ సర్టిఫికెట్‌ లేకుండా టీజర్‌‎ను ఎలా విడుదల చేస్తారు. సమాజం పట్ల బాధ్యతగా లేదా? ఇలాంటి టీజర్‌‎తో సొసూటీకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు?"అంటూ హైకోర్టు అభ్యంతరాలు తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌కు నోటీసులు జారీచేసింది. అనంతరం ఈ కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈమేరకు చిత్ర నిర్మాతకు ఉత్తర్వులిచ్చింది. టైగర్‌ నాగేశ్వరరావు టీజర్ ఎరుకల సామాజికవర్గానికి చెందిన ప్రజల మనోభావాలను కించపరిచేదిగా ఉందని, తమ గ్రామ ప్రజల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ చుక్కా పాల్‌రాజ్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Updated : 31 Aug 2023 8:57 AM IST
Tags:    
Next Story
Share it
Top