Silvina Luna : కాస్మెటిక్ సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత
X
సినిమా తారలు కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం కొత్తేమీ కాదు. అందాల తార శ్రీదేవి తన ముక్కు మరింత అందంగా కనిపించాలని సర్జరీ చేయించుకుంది. కొంతమంది టాలీవుడ్ హీరోలు కూడా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. పైకి చెప్పకపోయినా ముఖం తీరుబట్టి అంచనా వేయొచ్చు. అయితే మరీ మొత్తం షేపులు మారిపోయేలా సర్జరీలు చేయించుకుంటే ప్రాణాలే పోతాయి. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మోడల్ సిల్వినా లూనా కాస్మెటిక్ సర్జరీ వికటించి మృతిచెందింది. ఆమె వయసు 43 ఏళ్లు.
అనుభవం లేని ఓ డాక్టర్ ఆమెకు 2011లో పిరుదుల సర్జరీ చేశాడు. పిరుదుల్లో ప్రమాదకర పదార్థాలు నింపడంతో కిడ్నీల్లో సమస్య తలెత్తింది. కొన్నాళ్లు వైద్యం చేయించుకుంది. కాస్మెటిక్ సర్జరీతో చాలా సమస్యలు తలెత్తాయి. వెంట్రుకలు రాలిపోవడంతోపాటు పాలు కీలక అవయవాలు మొరాయించాయి. గత రెండు నెలలుగా ఆమె బ్యూనోస్ ఏరిస్లోని ఓ ఆస్పత్రిలోనే ఉంది. కృత్రిమ శ్వాసపై ఉంచి చికిత్స చేశారు. కిడ్నీలు పూర్తిగా పాడవడంతో చనిపోయింది. సినిమాలతోపాటు టీవీ, ఫ్యాషన్ రంగాల్లో లక్షలాది అభిమానులు సంపాదించుకున్న సిల్వినా మృతితో అర్జెంటీనా వినోద పరిశ్రమంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
అమెరికాకు చెందిన క్రిస్టినా ఆష్టన్ గౌకని అనే మోడల్ కూడా ప్లాస్టిక్ సర్జరీ ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్లో కన్నుమూసింది. ప్రముఖ నటి కిమ్ కర్దాషియన్ను పోలినట్లుంటే ఆమె వయసు కేవలం 34 ఏళ్లే. మనదేశానికి చెందిన చేతన్ రాజ్ కూడా ప్లాస్టిక్ సర్జర వికటించి మే నెలలో చనిపోయింది.