ఆ సంగతి నా కొడుక్కి కూడా తెలుసు.. రెండో పెళ్లిపై ఆశీష్ విద్యార్థి కామెంట్స్
X
లేటు(60 ఏండ్ల) వయస్సులో రెండో పెళ్లి చేసుకుని ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆశీష్ విద్యార్థి.. అంతకుముందు తన వైవాహిక జీవితం గురించి, తన కొడుకు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారని తాజా ఇంటర్వ్యూలో ఆశీష్ విద్యార్ధి తెలిపాడు. తన మొదటి భార్య రాజోషితో.. తనకు ఆర్త్ అనే టీనేజ్ లో ఉన్న కొడుకు ఉన్నాడని , తాము విడిపోతున్నామని ఆర్ట్ తో చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు.
రాజోషితో తనకి చాలా కాలంగా మనస్పర్ధల కారణంగా గొడవలు అవుతున్నాయని.. ఈ సంగతి తన కొడుక్కి కూడా తెలుసునన్నారు. అయినా కూడా విడిపోవాలని డిసైడ్ అయినపుడు.. దానిని అతను ఎలా యాక్సప్ట్ చేస్తాడో అని భయం వేసిందన్నారు. విడాకుల విషయం చెప్పడానికి చాలా మొహమాట పడ్డానన్నారు. ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, దీంతో అతనినితో మాట్లాడి అర్ధమయ్యే విధంగా చెప్పడంతో.. ఆర్త్ కూడా తమ నిర్ణయాలని గౌరవించాడన్నారు.
విడిపోవాలనే మా అభిప్రాయాల్ని ఆర్త్ గౌరవించాడని, అయితే విడాకులు తీసుకున్న కూడా అతని విషయంలో మా బాధ్యత, ప్రేమ అంతే స్థాయిలో ఉంటుంది అని ఆశీష్ విద్యార్ధి చెప్పుకొచ్చారు. అయితే రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. మొదటి భార్యతో విడిపోవడానికి మనస్పర్ధలే కారణం అని క్లారిటీ ఇచ్చారు.