రాత్రికి రాత్రే క్రిమినల్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్..'భరతనాట్యం' ట్రైలర్ రిలీజ్
X
దొరసాని లాంటి హిట్ మూవీ తీసిన డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర ఇప్పుడు భరతనాట్యం మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో హీరోహీరోయిన్లుగా సూర్య తేజ, మీనాక్షి గోస్వామి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమా ఈజ్ ది మోస్ట్ బ్యూటీఫుల్ ఫ్రాడ్ ఇన్ ది వరల్డ్ అనే ట్యాగ్ లైన్‌లో ఈ మూవీ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
ట్రైలర్ కోసం కట్ చేసిన సీన్స్ అదిరిపోయాయి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే ఓ వ్యక్తి చుట్టూ ఫన్నీగా సాగే సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ లాంటివి ట్రైలర్‌లో చూపించారు. వైవా హర్ష కామెడీ సీన్స్ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచాయి. హర్షవర్దన్, అజయ్ ఘోష్ సీరియస్ టైమింగ్‌లో చేసే ఫన్నీ సీన్సీ అందర్నీ ఆకట్టుకుంటాయి. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న హీరో రాత్రికి రాత్రే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడంటూ చెప్పే ట్విస్ట్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను కలిగిస్తోంది.
హీరోయిన్‌తో లిప్‌లాక్, లవ్ ఎమోషన్స్, ఫైట్స్ చూపించారు. సినిమాలో అన్నిరకాల ఎలిమెంట్స్ ఫుష్కలంగా ఉన్నట్లు ట్రైలర్ కట్‌లో చూపించడంతో ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. వివేక్ సాగర్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి అన్ని రకాల ఆడియన్స్ అందరూ చూడదగ్గ సినిమాగా 'భరతనాట్యం' ట్రైలర్ చెబుతోంది. ఇక మరెందుకు ఆలస్యం మీరూ ట్రైలర్ చూసేయండి.