Home > సినిమా > స్టార్ హీరోయిన్ రకుల్‎పై వేణు స్వామి కాంట్రవర్సీ కామెంట్స్

స్టార్ హీరోయిన్ రకుల్‎పై వేణు స్వామి కాంట్రవర్సీ కామెంట్స్

స్టార్ హీరోయిన్ రకుల్‎పై వేణు స్వామి కాంట్రవర్సీ కామెంట్స్
X

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. టాలీవుడ్‌లో క్రేజీ ఆస్ట్రాలజర్‎గా పేరు సంపాదించుకున్నాడు. స్టార్ హీరోలకు, హీరోయిన్లకు జాతకం చెప్పడమే కాదు, దాదాపు 2 వేలకు పైగా చిత్రాలకు ముహూర్తం పెట్టి పెద్ద పంతులయ్యాడు వేణు స్వామి. ఇప్పటికే చాలా మంది స్టార్ కపుల్స్ డివోర్స్ తీసుకుంటారని చెప్పి టాలీవుడ్‎లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే విధంగా సామ్, నాగ చైతన్య విడిపోతారని చెప్పి అందరికీ షాకిచ్చాడు. వేణు స్వామి చెప్పినట్లుగానే వీరు డివోర్స్ తీసుకోవడంతో ఆయన ఆస్ట్రాలజీ వర్కౌట్ అవుతుందని అందరూ నమ్మడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియా వేదికగా తరచుగా సెలబ్రిటీల జాతకాలకు సంబంధించిన సంచలన విషయాలను పంచుకుంటుంటారు వేణు స్వామి. తాజాగా వేణు స్వామి మరోసారి వర్తల్లో నిలిచారు. ఈ స్టార్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‎పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‎లో మకాం వేసింది. ఓ వైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే ఈ బ్యూటీ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి రకుల్ వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రకుల్ పెళ్లి చేసుకుంటే సమంతకు జరిగినట్లే జరుగుతుందని చెప్పుకొచ్చారు. రకుల్ కు పెళ్లి సెట్ కాదని తేల్చేశారు. ఒకవేళ తనను కాదని పెళ్లి చేసుకుంటే సమంత లాగే తాను విడాకులు తీసుకుంటుందని తెలిపారు. అంతే కాదు కెరీర్ పరంగానూ పెద్దగా గ్రోత్ ఏమీ ఉండదన్నారు. అయితే ఈ విషయంపై నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంత మంది వేణు స్వామి చెప్పింది నిజమవుతుందని సమర్థిస్తుంటే మరికొంత మంది వాటిని కొట్టి పారేస్తున్నారు.





Updated : 29 July 2023 1:36 PM IST
Tags:    
Next Story
Share it
Top