Home > సినిమా > ఈ వెబ్ సిరీస్ చూస్తే ప్యాంట్ తడిచిపోద్ది..హర్రర్ లవర్స్‎కు బిగ్ ట్రీట్..

ఈ వెబ్ సిరీస్ చూస్తే ప్యాంట్ తడిచిపోద్ది..హర్రర్ లవర్స్‎కు బిగ్ ట్రీట్..

ఈ వెబ్ సిరీస్ చూస్తే ప్యాంట్ తడిచిపోద్ది..హర్రర్ లవర్స్‎కు బిగ్ ట్రీట్..
X

వేణు తొట్టెంపూడి ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో. ఈయన నటించిన దాదాపు అన్ని సినిమాలు మంచి హిట్ సాధించినవే. వైవిధ్యమైన కథలతో, తనదైన నటనతో ప్రేక్షకులను కొన్నేళ్లు అలరించాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, రామారావు ఆన్ డ్యూటీ అనే సినీమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. అయినప్పటికీ వేణుకు మాత్రం ఆఫర్ల కొదవ లేదు. వరుసగా ఆఫర్లు వేణు తలుపు తడుతున్నాయి. వేణు వెండితెరమీదనే కాదు లేటెస్టుగా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓటీటీలో ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. వేణు ప్రధాన పాత్రలో నటించిన అతిథి అనే వెబ్ సిరీస్‎ ప్రముఖ ఓటీటీ ప్లాట్‎ఫార్మ్ లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‎ను వదిలారు. హారర్ కథతో వస్తోన్న ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ మధ్య ప్రేక్షకులు సినిమా థియేటర్స్‎కు వెళ్లి సినిమా చూసే కన్నా ఓటిటీల మీదనే మనసు పారేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తంచిన సెలబ్రిటీలు, స్టార్ నటీనటులు సినిమాలతో పాటుగా ఓటీటీకి కూడా ఓటు వేస్తున్నారు. సరికొత్త వెబ్ సిరీస్‎లతో ఓటిటీ ద్వారా తమ అభిమానులకు దగ్గరవుతున్నారు. లేటెస్టుగా వేణు కూడా ఓటీటీ బాట పట్టాడు. ఓ హారర్ వెబ్ సిరీస్‎తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు తొట్టెంపూడి, అవంతిక, సియా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ అతిథి. ప్రవీణ్ సత్తార్ ఈ సిరీస్‎ను నిర్మించడం విశేషం. భరత్ డైరెక్షన్‎లో ఈ హర్రర్ సిరీస్ తెరకెక్కబోతోంది. ఈ సిరీస్‎కు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‎ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఓ రేంజ్‎లో భయపెడుతోంది. ఈ ట్రైలర్‎లో మ్యూజికే సగం మంది ప్రేక్షకులను ఓ రేంజ్‎లో భయపెడుతోంది. హర్రర్ లవర్స్‎కు ఈ సిరీస్ ఒక మంచి ట్రీట్ అని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‎లో సెప్టెంబర్ 19 న ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఏవిధంగా భయపెడుతుందో చూడాలి.

Updated : 8 Sept 2023 6:08 PM IST
Tags:    
Next Story
Share it
Top