కన్నడ స్టార్ హీరో ఉపేంద్రపై కేసు నమోదు
X
తమిళ సూపర్ స్టార్ ఉపేంద్ర చిక్కుల్లో పడ్డారు. ఓ సభలో ఆయన చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన సొంత రాజకీయ పార్టీ ప్రజాకీయా వర్షికోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగం దళితులను అవమానించేలా ఉందని కొంత మంది ఆయనపై బెంగళూరులో కేసు ఫైల్ చేశారు. దీంతో ఇప్పుడు కన్నడ నాట ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది.
శనివారం ‘ప్రజాకీయా’ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో లైవ్‌గా టెలికాస్ట్ చేశారు. ఈ సభలో ఉపేంద్ర విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ ఆయన పలు సామెతలు చెప్పారు. ఈ కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఉపేంద్ర కామెంట్స్ తమని తీవ్రంగా బాధించాయంటూ సమతా సైనిక్ దళ్ ఆదివారం ఆయనపై బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌కు కంప్లైంట్ అందింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు.
ఈ కేసును సవాల్ చేస్తూ, తాను చెప్పిన కన్నడ సామెతతో దళితులకు ఎలాంటి సంబంధం లేదని ఉపేంద్ర స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని అవమానించే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.
ఇప్పటికే ఉపేంద్ర ఈ విషయంలో క్షమాపణలు చెప్పారు. శనివారం ప్రసారం చేసిన లైవ్ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు." పొరపాటున నోరు జారి అలా మాట్లాడాను. నా మాటలు చాలా మందిని ఇబ్బందిపెట్టాయని, అందుకే లైవ్ వీడియోను తొలగించాను. ఇలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి" అంటూ ఉపేంద్ర పోస్ట్ పెట్టారు.