PM Modi's visit to Ayodhya : ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ఇదే
X
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 22(రేపు సోమవారం)న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ మేరకు పీఎం అయోధ్య పర్యటన అధికారిక కార్యక్రమం వెలువడింది. ఇందులో భాగంగా ప్రధాని సోమవారం ఉదయం అయోధ్యకు చేరుకుంటారు. ఆపై మధ్యాహ్నం 12.05 గంటలకు శ్రీరామ జన్మభూమి ఆలయంలో ప్రాణ ప్రతిష్ట పూజలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు అయోధ్యలో జరిగే బహిరంగ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2:15 గంటలకు కుబేర్ తిలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అధికారిక ప్రకటన ప్రకారం..
ప్రధాని మోడీ అయోధ్య పర్యటన షెడ్యూల్ ఇదే..
10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు.
10.55 గంటలకు శ్రీరామజన్మభూమి ఆలయానికి వస్తారు.
11-12 గంటల వరకూ ఆలయంలోనే ఉంటారు.
12.05 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు.
12.55 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలు పూర్తి కాగానే ప్రధాని ఆలయం నుంచి వెళ్లిపోతారు. మధ్యాహ్నం 1.00 గంటలకు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉంటారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో అయోధ్యకు సంబంధించి కొన్ని ప్రణాళికలను ప్రధాని మోడీ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలాలోని శివాలయాన్ని ప్రధాని సందర్శించి పూజిస్తారు.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెల్లడించింది.