Home > సినిమా > బిగ్బాస్-7 సీక్రెట్ ప్లాన్.. హైప్ పెంచేందుకు యంగ్ హీరోయిన్..?

బిగ్బాస్-7 సీక్రెట్ ప్లాన్.. హైప్ పెంచేందుకు యంగ్ హీరోయిన్..?

బిగ్బాస్-7 సీక్రెట్ ప్లాన్.. హైప్ పెంచేందుకు యంగ్ హీరోయిన్..?
X

బుల్లి తెరపై బిగ్ బాస్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సీజన్లు మారుతున్నా ఈ షోకు హైప్ మాత్రం తగ్గడం లేదు. ఇక మరో సీజన్ రాబోతుంది.. అన్న వార్త వినగానే గుసగుసలు మొదలవుతాయి. ఈసారి వాళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.. వాళ్లకు అవకాశం దక్కింది అంటూ వార్తలు వైరల్ చేస్తారు. తాజాగా మరో వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ -7 గురించి ఇప్పటికే చాలా పుకార్లు బయటికి వచ్చినా.. ఇప్పుడో వార్త మరింత హైప్ ను క్రియేట్ చేస్తోంది.

బేబీ సినిమాతో వెండి తెరపై తలుక్కుమన్న తెలుగు నటి వైష్ణవీ చైతన్య. తనకు బిగ్ బాస్ నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభమయ్యే బిగ్ బాస్ సీజన్-7 షోలో ఆఫర్ కొట్టేసినట్లు టాక్. ప్రస్తుతం వైష్ణవీ బేబీ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండగా.. బిగ్ బాస్ అవకాశం తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి అమర్ దీప్, తేజస్విని, శ్వేతా నాయుడు, దీపికా పిల్లి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

Updated : 22 July 2023 5:34 PM IST
Tags:    
Next Story
Share it
Top