చరిత్ర సృష్టిస్తున్న బేబీ మూవీ
X
అస్సలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయి కలెక్షన్లు దుమ్ము రేపుతున్న బేబి ఇప్పుడు మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదల అయిన పదవరోజు తెలంగాణ లో 3.40 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ విషయాన్ని దర్శకుడు సాయిరాజేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కల్ట్ సినిమాగా టాక్ తెచ్చుకుని ఇప్పటికీ కోట్ల వర్షం కురిపిస్తోంది బేబి మూవీ. జూలై 14న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 66కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది. మరిన్ని వసూళ్ళను రాబడుతుందని ఫిల్మ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో వారం కంటే ఎక్కువ థియేటర్లలో సినిమాలు ఆడడమే కష్టం అయిపోతోంది. అలాంటిది బేబీ మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. మొదటిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. పదో రోజు కూడా దాదాపు అదే టెంపో మెంటైన్ చేస్తోంది.
ఆదివారం 3.40కోట్ల కలెక్ట్ చేసి బేబి మూవీ మిడ్ రేంజ్ సినిమాల్లో 10వరోజు బాక్సీఫీస్ దగ్గర అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరైనోడు లాంటి సినిమాలను అధిగమించిందని దర్శకుడు సాయి రాజేష్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.