బేబీ సినిమాలాగే నా జీవితంలోనూ జరిగింది : బేబీ నటుడు
X
చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ బేబీ. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. 14కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 80కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక ఈ మూవీలో వైష్ణవి నటనకు అందరు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఆనంద్, విరాజ్ను కాదని వైష్ణవి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అతడు కనిపించేది ఒక్క షాటైనా మీమర్స్కు కావాల్సినంత స్టఫ్ ఇచ్చాడు.
వైష్ణవికి హస్బెండ్గా నటించిన వ్యక్తి పేరు కృష్ణ మల్లిడి. ఇతడు బింబిసార డైరెక్టర్ వశిష్ఠకు సోదరుడు. డైరెక్టర్ అవుదామనుకుని నటుడు అయిన కృష్ణ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పాడు. బేబి సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలోనూ తనను ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్పాడు. తన లైఫ్లో మొత్తం మూడు లవ్ బ్రేకప్స్ ఉన్నాయని వివరించాడు. తాను లవ్ చేసిన అమ్మాయి తనతో పాటు మరో అబ్బాయితోనూ డేటింగ్ చేసిందని.. దాంతో తను నరకం అనుభవించానని తెలిపాడు.
‘‘నేను ప్రేమించిన నన్ను మోసం చేసింది. నాతోపాటే మరో అబ్బాయితో డేటింగ్ నడిపింది. అయినా నేను ఆమెను వదిలేయాలనుకోలేదు. కానీ ఆ అమ్మాయి మాత్రం మరో అబ్బాయిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అయినా సరే ఇద్దరితో ఉండమని చెప్పాను. ఆ టైంలో నేను ఎంతో నరకం అనుభవించాను. సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా. చివరకు ఆమెకు బ్రేకప్ చెప్పేశా. అప్పుడు మా నాన్న నాకు అండగా ఉన్నాడు. ఆయన వల్లే మళ్లీ మామూలు మనిషిని అయ్యా’’ అని కృష్ణ మల్లిడి చెప్పాడు.
baby movie actor krishna mallidi shares his love breakups
baby,baby movie,krishna mallidi,vaishnavi chaitanya,anand devarakonda,sai razesh,bimbisara director,vasishta,tollywood,entertainment,