Home > సినిమా > బేబి' వైష్ణవికి బలగం నుంచి వచ్చిన ఆఫర్..కానీ..

బేబి' వైష్ణవికి బలగం నుంచి వచ్చిన ఆఫర్..కానీ..

బేబి వైష్ణవికి బలగం నుంచి వచ్చిన ఆఫర్..కానీ..
X

బేబి సినిమాతో ఓవర్ నైట్‎లో స్టార్ అయిపోయింది హైదరాబాదీ ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. ఈ మూవీలో వైష్ణవి పెర్ఫార్మెన్స్ కుర్రాళ్ళకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. టిక్ టాక్ వీడియోలు, ఇన్‎స్టా రీల్స్ , యూట్యూబ్‎లో షార్ట్ ఫిల్మ్స్ తో ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అలరించిన ఈ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్‎ను సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీలోనూ మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తన టాలెంట్‎ ఏమిటో ప్రూవ్ చేసుకుంది. నార్మల్ ఆడియన్స్ నుండి స్టార్స్ వరకు వైష్ణవి యాక్టింగ్‎కు ఫిదా అయ్యారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే బేబీ సినిమాను వైష్ణవి. తన భుజాలపై మోసింది. ఈ మూవీలో వైష్ణవి క్యారెక్టర్‎కు చాలా మంది కనెక్ట్ అయ్యారు.

అయితే తాజాగా వైష్ణవి టాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కంటే ముందు ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్న బలగం సినిమాలో అమ్మడికి ఛాన్స్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. బలగం మూవీ మేకర్స్ అమ్మడిని అప్రోచ్ అయినా స్మూత్‎గా ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. సినిమా కథ బాగున్నప్పటికీ అందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదని తెలుసుకుని నిరాకరించిందని సమాచారం. ఇండస్ట్రీలో అడుగుపెట్టే ప్రారంభంలో తనని తాను నిరూపించుకోవడానికి బలగం సినిమా కరక్ట్ కాదని ఫీల్ అయిందట. అందుకే ఈ సినిమాను చేసేందుకు అంగీకరించలేదట. దీంతో మేకర్స్ తరువాత ఆ పాత్ర కోసం కావ్య కళ్యాణ్ రామ్‎ను తీసుకున్నారు.

దీంతో వైష్ణవి తీసుకున్న నిర్ణయం సరైనదే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఒకవేళ వైష్ణవి బలగం సినిమా చేసుంటే ఇంతలా క్రేజ్ వచ్చి ఉండేది కాదని అంటున్నారు. ఏదిఏమైనా బేబీ బ్లాక్ బస్టర్ హిట్‎తో వైష్ణవికి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయట. గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి కూడా అదిరిపోయే భారీ ఆఫర్ వచ్చిందని ఇన్ఫర్మేషన్.


Updated : 24 July 2023 1:54 PM IST
Tags:    
Next Story
Share it
Top