Home > సినిమా > స్టోరీలో కంటెంట్‌తోనే రూ.కోట్ల వసూళ్లు.. 'బేబీ' సంచలనం

స్టోరీలో కంటెంట్‌తోనే రూ.కోట్ల వసూళ్లు.. 'బేబీ' సంచలనం

స్టోరీలో కంటెంట్‌తోనే రూ.కోట్ల వసూళ్లు.. బేబీ సంచలనం
X

స్టోరీలో కంటెంట్ ఉంటే చాలు.. తమ కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదు, హై బడ్జెట్ కాదని బేబీ సినిమాతో మరోసారి నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా జులై 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. విడుదలై వారమైనా బాక్సాఫీస్ దగ్గర బేబీ సినిమా కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు. వీకెండ్స్ లో కాదు.. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కలెక్షన్స్ రాబడుతోంది. తాజాగా ఈ సినిమా రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలై కేవలం వారం రోజుల్లోనే యాభై కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది బేబీ సినిమా. తాజాగా ఇదే విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ యాభై కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లు కలెక్ట్ చేయడంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ లాభాలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాభాలు వచ్చిన సినిమా బేబీ నే కావడం విశేషం.

ఇదిలా ఉండగా నిన్న( శనివారం రాత్రి) తిరుపతి సంధ్య థియేటర్లో సందడి చేసింది బేబీ సినిమా యూనిట్ .ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకుల ధన్యవాదాలు తెలిపారు. సినిమా బాగుందా? ఎన్నిసార్లు చూశారంటూ హీరోయిన్ వైష్ణవి ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపారు. బేబీ సినిమా కలెక్షన్లు బాగున్నాయని వారం రోజులు పూర్తి అవ్వడంతో 54కోట్లు రాబట్టగలిగిందన్నారు. ప్రేక్షకులు కేరింతలతో సినిమా హాలు మారుమోగింది.

ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. మొదటి రోజున బేబీ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. 2 వ రోజు 3.56 కోట్ల షేర్ ... 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు, 3 వ రోజు 4.39 కోట్ల షేర్ ... 7.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు, 4 వ రోజు 4.08 కోట్ల షేర్ ... 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు , 5 వ రోజు 3.30 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు , 6 వ రోజు 2.70 కోట్ల షేర్ ... 5.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు , 7 వ రోజు 2.12 కోట్ల షేర్ ... 4.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు.. మొత్తంగా 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23.53 కోట్ల షేర్ ... 44.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. 8 రోజుల్లోనే యాభై కోట్ల మార్క్ ని దాటింది. 8 రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ. 54కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ లెక్కన ఇది సుమారు రూ.25కోట్లకుపైగానే షేర్‌ సాధించింది. కేవలం 14కోట్ల బడ్జెట్‌తో, 16కోట్ల(థియేట్రికల్‌, డిజిటల్‌) ప్రీ రిలీజ్‌ బిజినెస్‌తో రిలీజ్‌ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. నేటి యువత తీరుతెన్నులను ఆవిష్కరించే కథాంశంతో, బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. నయా ట్రెడ్‌ని క్రియేట్‌ చేసింది.

Updated : 23 July 2023 11:15 AM IST
Tags:    
Next Story
Share it
Top