Home > సినిమా > పూట గడవడం కోసం ఆ పనిచేసిన బేబీ హీరోయిన్

పూట గడవడం కోసం ఆ పనిచేసిన బేబీ హీరోయిన్

పూట గడవడం కోసం ఆ పనిచేసిన బేబీ హీరోయిన్
X

బేబీ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ వైష్ణవి. సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్‌తో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బేబీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీ టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ మూవీలో తన నటనతో మెప్పించిన వైష్ణవిని మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం ప్రశంసలు కురిపంచారు. ఈ మధ్యనే ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది.

చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు చేపట్టానని చెప్పుకొచ్చిన వైష్ణవి, ఆ తర్వాత తనకు ఎదురైన కష్టాల గురించి చెప్పింది. పూట గడవడం కోసం తాను రాత్రుళ్లు బర్త్ డే పార్టీస్, పెళ్లి ఈవెంట్స్‌లల్లో డ్యాన్స్ చేసేదాన్నని తెలిపింది. బర్త్ డే పార్టీలో డ్యాన్స్ చేస్తే 700 రూపాయల వరకూ ఇచ్చేవారని, ఆ డబ్బులతో కుటుంబం కడుపు నిండేదని చెప్పుకొచ్చింది. యూట్యూబ్ వీడియోలు చేసే సమయంలో బట్టలు మార్చుకునేందుకు కూడా సెపరేట్ రూమ్ ఉండేది కాదని, బాత్‌రూమ్ లోనే బట్టలు మార్చుకునేదాన్నని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓ సినిమా షూటింగ్ అప్పుడు చిన్న పాత్ర చేస్తున్న సమయంలో వాష్ రూమ్ కోసం క్యారవాన్ యూజ్ చేసుకోవాలని అడిగితే తనను చాలా మాటలు అన్నారని, అది భరించలేకపోయానని వైష్ణవి ఎమోషనల్ అయ్యింది. అప్పుడే తాను ఏదో ఒకటి సాధించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. వైష్ణవి ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బేబీ మూవీ తర్వాత ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవి ప్రస్తుతం 3 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ఆశిష్ హీరోగా నటిస్తున్న ‘లవ్ మీ’ సినిమా ఒకటి కాగా మరో రెండు సినిమాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.


Updated : 13 March 2024 7:42 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top