Home > సినిమా > బేబీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

బేబీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

బేబీ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..
X

ఇటీవల రిలీజై టాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన మూవీ బేబీ. తమ కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదని.. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలని ప్రేక్షకులు బేబీ సినిమాతో మరోసారి నిరూపించారు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన ఈ మూవీ జులై 14న థియేటర్స్లోకి వచ్చింది. ఫస్ట్ డే నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. 14కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ 80కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మూవీ యూనిట్ గుడ్ న్యూస్ తెలిపింది. బేబీ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న ఆహా.. తాజాగా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ నెల 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ చేస్తామని తెలిపింది. ఇక ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు 12గంటల ముందుగానే ఈ సినిమా అందుబాటులో ఉంటుందని చెప్పింది. అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుంచి వాళ్లకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో సినీ లవర్స్ ఖుషీ అవుతున్నారు.

అంతకుముందే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్లో సూపర్ హిట్ అవ్వడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమైంది. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాభాలు వచ్చిన సినిమా బేబీ నే కావడం విశేషం. కాగా ఓటీటీలో మరింత బోల్డ్గా బేబీ సినిమా రానుంది. థియేటర్స్లో సెన్సార్ కట్ చేసిన సీన్స్ను ఓటీటీలో విడుదల చేయనున్నారు.


Updated : 18 Aug 2023 12:12 PM IST
Tags:    
Next Story
Share it
Top