కలెక్షన్ల సునామీ.. ఓటీటీలో మరింత ఆలస్యంగా బేబీ..
X
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది బేబీ మూవీ. స్టోరీలో కంటెంట్ ఉంటే చాలు.. తమ కావాల్సిందీ స్టార్ క్యాస్ట్ కాదు, హై బడ్జెట్ కాదని బేబీ సినిమాతో మరోసారి నిరూపించారు తెలుగు ప్రేక్షకులు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా జులై 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. విడుదలై వారమైనా బాక్సాఫీస్ దగ్గర బేబీ సినిమా కలెక్షన్స్ జోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు.
వీకెండ్స్లో కాదు.. వీక్ డేస్లో కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కలెక్షన్స్ రాబడుతోంది. 9 రోజుల్లోనే ఈ మూవీ 60 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసింది. కేవలం 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లు క్లబ్ లో చేరి ఔరా అనిపించింది. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఈ రేంజ్ లాభాలు వచ్చిన సినిమా బేబీ నే కావడం విశేషం. ఈ యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ అనుకున్న సమయం కంటే మరింత ఆలస్యంగా ఓటీటీలోకి రానుందట.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా బేబీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ముందుగా ఈ మూవీని రిలీజైనా 4,5 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. అయితే థియేటర్లలో సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి ఓటీటీ రిలీజ్ డేట్ ఛేంజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.