Home > సినిమా > గూస్ బంప్స్ తెప్పిస్తోన్న.. కల్కి 2989 AD థీమ్ సాంగ్ లీక్! ఆ BGM ఏంటి సామీ

గూస్ బంప్స్ తెప్పిస్తోన్న.. కల్కి 2989 AD థీమ్ సాంగ్ లీక్! ఆ BGM ఏంటి సామీ

గూస్ బంప్స్ తెప్పిస్తోన్న.. కల్కి 2989 AD థీమ్ సాంగ్ లీక్! ఆ BGM ఏంటి సామీ
X

కల్కి 2989 AD.. పాన్ ఇండియా ప్రభాస్ అభిమానులు ఈ సినిమాకు ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా, దీపిక పదుకొణె హీరోయినగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సినిమా ఇది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో, వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. ఈ ఏడాది వేసవి కానుకగా.. ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీ మే 9న విడుదల కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. కల్కి 2989 AD మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుందట.

ఈ క్రమంలో సినిమా నుంచి వచ్చిన ఏ చిన్న న్యూస్ అయినా సెన్సెషన్ అవుతుంది. క్లిప్స్, ఫొటోలు, మేకింగ్ వీడియోలు సినిమాపై హైప్ ను పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ తో అంచనాలను దాటేసింది కల్కీ. తాజాగా మేకర్స్ మరో గ్లింప్స్ ను విడుదల చేశారు. కల్కీ 2989 AD అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది రిలీజ్ అయింది. దాదాపు 5 సెకన్లు ఉన్న ఈ వీడియోలో.. షూటింగ్ లొకేషన్ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంటే కాలును ఆడిస్తుంటారు. ఆ మ్యూజిక్ పూనకాలు తెప్పించేలా ఉంది. అది సినిమాలోనిదే అని కొందరు అంటున్నారు.గూస్ బంప్స్ తెప్పిస్తోన్న.. కల్కి 2989 AD థీమ్ సాంగ్ లీక్! ఆ BGM ఏంటి సామీ

Updated : 24 Feb 2024 1:11 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top