Samantha : ఇక ఆ పని చేస్తానంటోన్న సమంత.. వర్క్ స్టార్ట్
X
(Samantha) టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన సమంత ఇప్పుడు తన హెల్త్ మీద ఫోకస్ చేసింది. సినిమాలకు కొన్నాళ్లుగా గ్యాప్ ఇచ్చిన సామ్..తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. అలాగే బిజినెస్‌లు కూడా చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఈ మధ్యనే సిటాడెల్ సిరీస్‌కి ఆమె డబ్బింగ్ చెప్పింది. దీంతో సమంత మళ్లీ సినిమా వర్క్ మొదలు పెట్టిందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె కొత్త సినిమాలేమీ చేయడం లేదు.
ప్రస్తుతం నిర్మాతగా కూడా సమంత బిజీగా ఉంది. త్వరలో తాను నిర్మించే సినిమా వివరాలను చెబుతానని ఆ మధ్య చెప్పుకొచ్చింది. అయితే ఆమె హీరోయిన్‌గా ఇప్పట్లో సినిమాలు వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా తన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సమంత ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ వీడియోలో సమంత మాట్లాడుతూ.. తాను మళ్లీ వర్క్ చేయబోతున్నానని చెప్పారు. అయితే హెల్త్ పాడ్‌కాస్ట్‌తో తాను ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలిపారు.
వచ్చేవారం తాను తన హెల్త్ పాడ్‌కాస్ట్‌లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. అవి చాలా మందికి ఉపయోగపడతాయని, ఆ పాడ్‌కాస్ట్ చేయడంలో తాను చాలా ఆనందించానని చెప్పుకొచ్చారు. సమంత పోస్ట్ ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. సమంతను స్క్రీన్ పై చూసి చాలా రోజులైంది. సమంత తన సినిమాను ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేస్తుందా అని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. సమంత తన హెల్త్ గురించి, తాను తీసుకున్న ట్రీట్‌మెంట్ గురించి, మరిన్ని ఆరోగ్య విషయాల గురించి తన పాడ్‌కాస్ట్‌లో చెప్పనుంది. దీంతో కొంత వరకైనా ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు.