Home > సినిమా > ఇలా ఉంటే అవకాశాలు రావని అవమానించారు.. బలగం హీరోయిన్

ఇలా ఉంటే అవకాశాలు రావని అవమానించారు.. బలగం హీరోయిన్

ఇలా ఉంటే అవకాశాలు రావని అవమానించారు.. బలగం హీరోయిన్
X

సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు, ఆర్టిస్టులు బాడీ షేమింగ్‎ను నిత్యం ఎదుర్కొంటుంటారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను , చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా బలగం నటి కావ్యా కల్యాణ్ కూడా కెరీర్ స్టార్టింగ్‎లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బొద్దుగా ఉండటం వల్ల తన శరీరాకృతిపైన అనేక అవహేళనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. దీంతో మరోసారి బాడీ షేమింగ్ అంశం తెరమీదకు వచ్చింది.

చైల్డ్ ఆర్టిస్ట్‎గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది కావ్యా కల్యాణ్ రామ్. జబర్దస్త్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమాలో హీరోయిన్‎గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. లేటెస్టుగా శ్రీసింహా హీరోగా రూపొందుతున్న ‘ఉస్తాద్’ మూవీలో కావ్య నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ చేస్తున్న కావ్య..నటిగా కెరీర్ స్టార్టింగ్‎లో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తెలిపింది. ఓ సినిమా ఆడిషన్స్‌కు వెళ్తే ... డైరెక్టర్, ప్రొడ్యూజర్లు బాడీ షేమింగ్‌ చేశారని చెప్పుకొచ్చింది. " మీరు చాలా లావుగా ఉన్నారు. ఇలాగే ఉంటే మీకు అవకాశాలు రావు. కాస్త సన్నబడండి . అని హేళన చేసినట్లు మాట్లాడారు. కానీ నేను అవేమీ పట్టించుకోలేదు. అయినా నాకు బలగం లాంటి సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది" అని కావ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‎గా మారాయి.

Updated : 12 July 2023 4:42 PM IST
Tags:    
Next Story
Share it
Top