100 అవార్డులతో బలగం కొత్త రికార్డ్
X
బలగం సినిమా విడుదల అయింది...ధియేటర్లు...ఓటీటీ, టీవీల్లో కూడా వచ్చేసింది. మూవీ పాత బడిపోయింది కానీ దాని మాత్రం తగ్గడం లేదు. ఈరోజుకీ ఏదో ఒక అవార్డ్ దక్కించుకుంటూనే ఉంది. తాజాగా మరో కొత్త రికార్డ్ను నెలకొల్పింది బలగం మూవీ. ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని ఫీట్ ఇది సొంతం చేసుకుంది.
జబర్దస్త్ వేణు దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన చిన్న సినిమా బలగం. ఫ్యామిటీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ అందరినీ కదిలించింది. విడుదలైనప్పుడే సంచలనం సృష్టించింది. గ్రామాల్లో తెరలు కట్టీ మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఓటీటీ, టీవీల్లో కూడా ప్రభంజనం సృష్టించింది. అలాగే సినిమా విడుదల అయినప్పటి నుంచి ఏదో ఒక అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంటూనే ఉంది. అలా అవార్డ్ లు కొల్లగొడుతూ ఇప్పుడూ ఏకంగా రికార్డ్ లనే సృష్టించింది. 100 ఇంటర్నేషనల్ అవార్డ్ లను ఓన్ చేసుకున్న సినిమాగా చరిత్రలో నిలిచింది బలగం మూవీ.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లోని ప్రతిష్టాత్మక ఫిల్మ ఫెస్టివల్స్ లో బలగం మూవీ ప్రదర్శితమైంది. దాంతో పాటూ 100 అవార్డులను కూడా గెలుపొందింది. తెలంగాణ నేపథ్యంలో కుటుంబంలోని బంధాలు, వాటి విలువల కథతో మృద్యంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచదేశాల మన్నలను అందుకుంటోంది. ఈ సినిమాకు ఇంతలా ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని మూవీ మేకర్స్ అంటున్నారు. అవార్డులతో బలగం మూవీ ప్రత్యేకంగా నిలిచిందని చెబుతున్నారు.
100రోజులు, 100 సెంటర్లు, 100 కోట్లు లెక్కలుగా సాగుతున్న భారతీయ సినిమాల్లో 100 అవార్డులతో ఓ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది బలగం మూవీ. అందుకే ఇదొక అద్భుతమైన, మరుపురాని ప్రయాణం అంటున్నారు ఈ సినిమా దర్శకుడు వేణు ఎల్దండి.