Home > సినిమా > బాలయ్యతో కామెడీ చేస్తున్నావ్ జాగ్రత్త

బాలయ్యతో కామెడీ చేస్తున్నావ్ జాగ్రత్త

బాలయ్యతో కామెడీ చేస్తున్నావ్ జాగ్రత్త
X

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన బాలయ్య.. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో హాట్రిట్ కొట్టెందుకు సిద్ధంగా ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ కాగా.. ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా సినిమా టైటిల్ విషయంలో కూడా పలు వార్తలు బయటికి వస్తున్నాయి. మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి క్లారిటీ రాకపోయినా.. భగవత్ కేసరి అనే టైటిల్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా అవుతోంది. కామెడీ సీన్స్ కు అనీల్ పెట్టింది పేరు. ఆయన సినిమాల్లో యాక్షన్ ఎంత ఉంటుందో.. అదే రేంజ్ లో కామెడీని కూడా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో బాలయ్య కోసం కూడా సపరేట్ కామెడీ ట్రాక్ ను క్రియేట్ చేసాడట అనిల్. కమేడియన్స్, బాలకృష్ణ మధ్య ఉండనున్న ఈ సీన్.. ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగింది. బాలయ్యతో కామెడీ చేస్తున్నావ్ జాగ్రత్త అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Updated : 4 Jun 2023 9:46 PM IST
Tags:    
Next Story
Share it
Top