Home > సినిమా > Bhagavanth Kesari: బాలయ్య మాస్ యాక్షన్.. తమనన్న బీజీఎం.. ఊర మాస్గా భగవంత్ కేసరి

Bhagavanth Kesari: బాలయ్య మాస్ యాక్షన్.. తమనన్న బీజీఎం.. ఊర మాస్గా భగవంత్ కేసరి

Bhagavanth Kesari: బాలయ్య మాస్ యాక్షన్.. తమనన్న బీజీఎం.. ఊర మాస్గా భగవంత్ కేసరి
X

బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన సినిమా భగవంత్ కేసరి. బ్రో.. ఐ డోంట్ కేర్ అనేది క్యాప్షన్. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ అనిల్. ఈ ఇద్దరి ఇమేజ్ లకు భిన్నమైన కథ, కథనాలతో రూపొందినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. భగవంత్ కేసరి పై ఎలా చూసినా.. భారీ అంచనాలున్నాయి.

ఫస్ట్ టైమ్ బాలకృష్ణ తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పాడీ సినిమాలో. ఈ ట్రైలర్ ద్వారా దసరా బరిలో ఉన్న సినిమాలకు బాలయ్య ఓ రేంజ్ లో పోటీ ఇవ్వబోతున్నట్లు అర్థం అవుతుంది. ఇక భగవంత్ కేసరి థమన్ సంగీతం అందించాడు. సి రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్. ట్రైలర్ చూస్తున్నంసేపు బాలయ్య ట్రాన్స్ లోకి వెళ్లిపోతారు. దానికి తమన్ బీజీఎం తోడవడంతో ట్రైలర్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. శ్రీలీల సినిమాలన్నింటితో పోల్చితే.. ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉండబోతుంది. కాజల్ అగర్వాల్ గ్లామర్ షో చేస్తున్నట్లు తెలుస్తుంది.






Updated : 8 Oct 2023 4:04 PM GMT
Tags:    
Next Story
Share it
Top