Home > సినిమా > బాలయ్య, రవితేజ కంటే విజయ్ పెద్ద హీరోనా..?

బాలయ్య, రవితేజ కంటే విజయ్ పెద్ద హీరోనా..?

బాలయ్య, రవితేజ కంటే విజయ్ పెద్ద హీరోనా..?
X

పండగల సీజన్స్ లో తమిళ్ లో వేరే భాషల హీరోల సినిమాలపై కఠినమైన ఆంక్షలుంటాయి. మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ అవి పేపర్ల వరకే పరిమితం. ఎవరూ సీరియస్ గా తీసుకోరు. పైగా నిర్ణయాలు చేసిన వాటిని వదిలేసి పోటీలు పడి మరీ డబ్బింగ్ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ దసరా సందర్భంగా తెలుగులో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. బాలకృష్ణ భగవంత్ కేసరి 19న, రవితేజ టైగర్ నాగేశ్వరరావు 20న విడుదలవుతున్నాయి. వీరితో పాటు తమిళ్ హీరో విజయ్ నటించి లియో కూడా 19నే విడుదలవుతోంది. అయితే మల్టీ ప్లెక్సెస్ తో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మన సినిమాల కంటే లియో టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం విశేషం.

లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన లియోపై తెలుగులో మరీ భారీ అంచనాలైతే లేవు. అయినా తెలుగులో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సరే పండగ టైమ్ లో ఎక్కువ సినిమాలకు ఆస్కారం ఉంటుందనుకున్నా.. టికెట్ ధరలు చూస్తే మాత్రం సగటు తెలుగు ప్రేక్షకుడితో పాటే మేకర్స్ కు కూడా ఒకరకమైన అసహనం కలుగుతుంది. ఎందుకంటే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కంటే లియో టికెట్ ధరలు అధికంగా ఉన్నాయి.

మల్టీ ప్లెక్స్ ల్లో బాలకృష్ణ భగవంత్ కేసరి కి 205/- రూపాయల టికెట్ ఉంది.

ఇదే చిత్రానికి సింగిల్ స్క్రీన్స్ లో 175/- రూపాయలు

టైగర్ నాగేశ్వరరావు మల్టీప్లెక్స్ లో 200/- రూపాయలు

సింగిల్ స్క్రీన్స్ లో 150/- రూపాయలు ఉంది.

కానీ లియోకు

మల్టీప్లెక్స్ ల్లో 295 /- రూపాయలు

సింగిల్ స్క్రీన్స్ లో 175 /- రూపాయలు టికెట్ ధరలు ఉన్నాయి.

దీంతో బాలకృష్ణ, రవితేజ కంటే విజయ్ ని పెద్ద స్టార్ గా చూస్తున్నారా అంటూ ఆ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ టికెట్ ధరలు నచ్చినవాళ్లే సినిమాలు చూస్తారు. కానీ మన హీరోలను మించి ఓ డబ్బింగ్ సినిమాకు అదనంగా చెల్లించేలా ఉండటం మాత్రం ఆమోదయోగ్యం కాదు అంటున్నారు. ఏదేమైనా డబ్బింగ్ సినిమాలను పండగల టైమ్ వేసి తెలుగు సినిమాలను కిల్ చేయడమే కాకుండా ఈ రకంగా కూడా దోచుకునేందుకు ఆస్కారం ఇవ్వడం ఎంత వరకూ సబబు అని సగటు తెలుగు సినిమా మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Variations in Dasara movie Ticket prices,

Bhagavanth Kesari Multiplex Ticket price - 250/- rs

Bhagavanth Kesari in Single Screens - 175 /- rs

Tiger nageswar rao Multiplex Ticket price - 200/- rs

Tiger nageswar rao Single Screens - 150 /- rs

Leo Multiplex Ticket price - 295/- rs

Leo Single Screens - 175 /-rs

Bhagavanth Kesari from October 19th

Leo Releasing on 19th

Tiger Nageswar Rao Release date 20th October,

Updated : 13 Oct 2023 2:23 PM IST
Tags:    
Next Story
Share it
Top