బాలకృష్ణ ఫ్యాన్స్‌కు శుభవార్త..థియేటర్లలో భైరవద్వీపం రీ రిలీజ్
X
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్‌కు శుభవార్త. బాలయ్య కథానాయకుడిగా నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీల్లో ఒకటైన భైరవద్వీపం మళ్లీ వెండితెరమీద సందడి చేసేందుకు రెడీ అయ్యింది. 1994లో ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. లేటెస్టుగా మరిన్ని హంగులను అద్దుకుని రీ రిలీజ్ కాబోతోంది. 4 k రిజుల్యూషన్‌తో భైరవద్వీపం చిత్రాన్ని ఆగస్టు 5న గ్రాండ్‌గా సినిమా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో నటి రోజా బాలయ్య సరసన నటించింది. రంభ ఓ ప్రత్యేక గీతంతో అలరించింది. అప్పట్లో ఈ ఫాంటసీ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. భైరవద్వీపం సినిమా ఏకంగా 9 నంది అవార్డులు దక్కించుకుని రికార్డులు బద్దలుకొట్టింది. ఇప్పుడు ఈ సినిమానే మరోసారి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. బాలయ్య సినిమాలు రీ రిలీజ్ కావడం కొత్తేమి కాదు, ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయిన చెన్న కేశవరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు థియేటర్లలో రీ రిలీజైన విషయం తెలిసిందే. ఫ్యాన్స్‌ను కూడా ఈ రెండు సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడిదే కోవలో భైరవ ద్వీపం కూడా విడుదల కానుండటంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్టుగా బాలయ్య అనిల్ రావిపూడితో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ భగవత్ కేసరి చేస్తున్నారు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్యకు కూతురిగా నటించనుంది. ఇప్పటికే మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తైంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం బాలయ్య బాబీ డైరెక్షన్‌లోనూ ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Witness the unforgettable 𝐅𝐀𝐍𝐓𝐀𝐒𝐘 𝐖𝐎𝐑𝐋𝐃 NBK's #BhairavaDweepam4k On Big Screens❤️🔥
— Ramesh Bala (@rameshlaus) July 25, 2023
Re-Releasing on AUG 5th by @ClapsInfotain 💥#NandamuriBalakrishna #Rambha #SingeetamSrinivasaRao @RojaSelvamaniRK pic.twitter.com/5Pzdee6TOe