Home > సినిమా > సుమకు చెంపదెబ్బలు అవసరం.. బాలయ్య వ్యాఖ్యలకు షాక్

సుమకు చెంపదెబ్బలు అవసరం.. బాలయ్య వ్యాఖ్యలకు షాక్

సుమకు చెంపదెబ్బలు అవసరం.. బాలయ్య వ్యాఖ్యలకు షాక్

సుమకు చెంపదెబ్బలు అవసరం.. బాలయ్య వ్యాఖ్యలకు షాక్
X

'నీకు అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరమని' బాలయ్య చేసిన వ్యాఖ్యలకు యాంకర్ సుమ ఒక్కసారిగా షాక్ అయింది. జగపతిబాబు హీరోగా, తెలంగాణ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్‌ నిర్మించిన రుద్రాంగి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మమతా మోహన్‌దాస్‌, ఆశిష్‌గాంధీ, విమలా రామన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమాకి అజయ్‌ సామ్రాట్‌ దర్శకత్వం వహించాడు. జులై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గురువారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమ.. బాలకృష్ణ వచ్చినప్పుడు “నేను ఆయన వచ్చారు అని చెప్పకుండానే చప్పట్లు కొడతారా? అంటూ వ్యాఖ్యానించింది. ఇక దీనికి బాలయ్య రియాక్ట్ అవుతూ.. ఈమెకు కొంచెం చెంప దెబ్బలు అప్పుడప్పుడు అవసరం. అయితే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చెప్పులు తీసుకోని చెప్పు దెబ్బలు కొడుతోంది మనల్ని. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా బ్రతుకుతున్నాడో ఈమెతో” అంటూ కాసేపు సుమని ఆటపట్టించాడు.

ఇంతలో జగపతిబాబు మైక్ తీసుకోని.. “నీకోసం (సుమ) బాలయ్య డేట్ కూడా మార్చుకున్నాడు. ఈ ఈవెంట్ ని 28వ తారీఖున చేయాల్సింది. కానీ నీకు 29న కుదురుతుంది అంటే ఆయన కూడా డేట్ సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇక మీ ఇద్దరు కొట్టుకోండి” అంటూ మరింత ఆట పట్టించాడు. అలాగే బాలయ్య మాట్లాడే అప్పుడు అభిమానులు ‘కోకాకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ’ అంటూ అరుస్తుంటే, బాలకృష్ణ ఆ స్లోగన్ కి రియాక్ట్ అవుతూ.. “నన్ను సెక్సీ అంటే ఇప్పుడు సుమ ఫీల్ అవుతుంది. ఆపండి అయ్యా బాబు” అంటూ సరదాగా మాట్లాడాడు. ఒకసారి ఆ వీడియోని మీరు కూడా చూసేయండి ఈ కింద ఉంది.


Updated : 30 Jun 2023 9:56 AM IST
Tags:    
Next Story
Share it
Top