Home > సినిమా > Balakrishna: బాలకృష్ణ వెకిలి చేష్టలు

Balakrishna: బాలకృష్ణ వెకిలి చేష్టలు

Balakrishna: బాలకృష్ణ వెకిలి చేష్టలు
X

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎలా ఉన్నా.. పబ్లిక్ లో మాత్రం తన బిహేవియర్ తో ఇబ్బంది పెడతాడు. పడతాడు కూడా. మామూలుగా పబ్లిక్ మేనర్స్ అని ఒకటుంటుంది. అది బాలయ్యలో మచ్చుకు కూడా కనిపించదు. తన అసిస్టెంట్స్ నుంచి చిన్న అసౌకర్యం కలిగించినా ఎడాపెడా కొట్టేస్తుంటాడు.వేదికలపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండదు.కొన్నాళ్ల క్రితం ఆడవాళ్లు కనిపిస్తే కడుపు చేయాలి అంటూ నీచమైన కమెంట్స్ చేశాడు. మరో సందర్భంలో మేం చూడని ఎత్తులా అంటూ హీరోయిన్లను ఉద్దేశిస్తూ అనడం పెద్ద వివాదాస్పదం అయింది.ఈ విషయంలోనే బాలకృష్ణకు చాలామంది నెగెటివ్ మార్కులు వేస్తుంటారు. అన్ స్టాపబుల్ షో ద్వారా కొంత మార్పు వచ్చింది అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదని భగవంత్ కేసరి ట్రైలర్ లాంచింగ్ లో మరోసారి నిరూపించుకున్నాడు.

శ్రీ లీలను తన పక్కన హీరోయిన్ గా చేయాలని అడిగాడట. ఆ విషయం ఇంట్లో చెబితే కొడుకు ఏకంగా గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అని తండ్రిని చాలా సంస్కారంగా మందలించాడట. ఈ విషయం చెప్పడం ద్వారా ఆయన ఏం సాధించాడో కానీ.. అభాసుపాలయ్యాడు. తనే కాదు.. తన పెంపకం విషయంలోనూ ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.

ఇక ఇదే వేదికపై పైసా వసూల్ చిత్రంలోని ఓ సంజ్ఞ చేస్తూ వెకిలిగా ప్రవర్తించాడు. ఇలాంటిదే మొన్న అసెంబ్లీలో కూడా చేసి వైసీపీ వారితో గెంటేయించుకున్నాడు. వేదికలపై.. ఆడవాళ్లు, పిల్లలు ఉన్న చోట ఈ వెకిలి మాటలు, చేష్టలు ఏంటో ఆ స్పెషల్ బ్రీడ్ వారికే తెలియాలి అంటూ ఇదే అదనుగా రాజకీయ ప్రత్యర్థులు కూడా విమర్శలు మొదలుపెట్టారు.

Updated : 9 Oct 2023 8:51 PM IST
Tags:    
Next Story
Share it
Top