Home > సినిమా > ‘నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెపిన్.. హిస్టరీ రిపీట్స్’: బాలయ్య

‘నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెపిన్.. హిస్టరీ రిపీట్స్’: బాలయ్య

‘నేను దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెపిన్.. హిస్టరీ రిపీట్స్’: బాలయ్య
X

నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అన్ స్టాపబుల్ షో ద్వారా బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముఖ్యంగా అఖండ సినిమాతో ఓ రేంజ్ లో బౌన్స్ బ్యాక్ అయిన బాలయ్య.. ప్రస్తుతం వెండితెరపై దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భగవంత్ కేసరి నుంచి వచ్చిన పోస్టర్స్, లుక్స్ ఇతర ప్రోమోలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. దాంతో ఈ సిపిమాకు బిజినెస్ ఆఫర్లు కూడా భారీగా వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ఏకంగా 75 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు సమాచారం. దసరా పండగకు గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఈ సినిమా ఓ రేంజ్ లో బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ సినిమాలో బాలయ్య పూర్తిస్థాయి తెలంగాణ యాసతో కనిపిస్తాడు. ఈ సినిమా అయిపోయాక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు బాలయ్య. పల్నాడు ప్రాంతంలో జరిగిన ఘటనను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా బాబీ తెరకెక్కిస్తున్నాడని చెప్తున్నారు. అంతేకాకుండా బాలయ్య మునుపెన్నడూ కనిపించని మాస్ అప్పీల్ లో కనిపిస్తాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఇతర నటీనటులపై అధికారికంగా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ కి ఓ వీక్ నెస్ ఉంటుందని.. సినిమాలో మెయిన్ స్క్రీన్ ప్లే మొత్తం ఈ వీక్ నెస్ మీదే నడుస్తోందని.. ఆ నేపథ్యంలో వచ్చే యాక్షన్ అండ్ కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని టాక్. ఈ సినిమాలో డైరెక్టర్ బాబీ.. బాలయ్య ఫ్యాన్స్ కోసం అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నాడట.

Updated : 22 Aug 2023 4:35 PM IST
Tags:    
Next Story
Share it
Top