Home > సినిమా > IND vs BAN: పట్టుబట్టిన బంగ్లా.. పడగొట్టిన టీమిండియా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs BAN: పట్టుబట్టిన బంగ్లా.. పడగొట్టిన టీమిండియా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs BAN: పట్టుబట్టిన బంగ్లా.. పడగొట్టిన టీమిండియా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?
X

బంగ్లాదేశ్ ప్లేయర్లు మేమేం తక్కువ కాదన్నట్లు బ్యాటింగ్ చేశారు. భారత బౌలింగ్ ను దాటిగా ఎదురుకుని చెప్పుకోదగ్గ స్కోర్ చేశారు. పుణెలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ఓపెనర్లు మొదటి నాలుగు ఓవర్లు కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత రాణించారు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. ఓపెనర్లు తజిద్ హసన్ (51, 43 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిట్టన్ దాస్ (66, 82 బంతుల్లో, 7 ఫోర్లు) టీమిండియాకు చెమటలు పట్టించారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు నజ్ముల్ (8), మెహదీ హసన్ (3), తౌహిద్ హిృదయ్ (16) తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. తర్వాత వచ్చిన బ్యాటర్లు రాణించారు. ముష్ఫికర్ రహిమ్ (38), మహ్మదుల్లా (46), చివర్లో నసుమ్ అహ్మెద్ (14) గట్టిగా పోరాడారు. దీంతో బంగ్లా 256 పరుగులకు చేరుకోగలిగింది.





దాటిగా ఆడుతున్న బంగ్లాను.. స్పిన్నర్లు బోల్తా కొట్టించారు. స్పిన్నర్ల ఎంట్రీతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. కుల్దీప్ యాదవ్, తజిద్ ను ఎల్బీడబ్ల్యూ చేయగా.. లిట్టన్ దాస్ ను జడేజా పెవిలియన్ చేర్చాడు. మూడో వికెట్ లో వచ్చిన కెప్టెన్ షాంటో (8) కూడా జడేజాకు దొరికిపోయాడు. హసన్ మిరాజ్ (3)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో టీమిండియా గాడిన పడింది. వెంట వెంటనే వికెట్లు తీసి మ్యాచ్ ను తిరిగి చేతుల్లోకి తీసుకుంది. తర్వాత శార్దూల్, బుమ్రా కూడా రెచ్చిపోవడంతో బంగ్లా 8 వికెట్లు కోల్పోయింది. జడేజా, బుమ్రా, సిరాజ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు.









Updated : 19 Oct 2023 1:03 PM GMT
Tags:    
Next Story
Share it
Top