Home > సినిమా > బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. మరోసారి టీఆర్పీపై కన్నేసిన బిగ్బాస్

బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. మరోసారి టీఆర్పీపై కన్నేసిన బిగ్బాస్

బర్రెలక్కకు బంపర్ ఆఫర్.. మరోసారి టీఆర్పీపై కన్నేసిన బిగ్బాస్
X

సోషల్ మీడియా సంచలనం కర్నె శిరీష్ అలియాస్ బర్రెలక్క.. తెలంగాణ ఎన్నికల బరిలో నిలబడి దేశంలో హాట్ టాపిక్ అయింది. నిరుద్యోగుల పక్షణ నిలబడి పోరాడింది. దాంతో ఆమెకు సోషల్ మీడియా నుంచి భారీ మద్దతు లభించింది. ఈ క్రమంలో ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో చాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7లో కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. రైతు బిడ్డగా సింపతీ సంపాదించుకున్న ప్రశాంత్ వల్ల.. గత సీజన్ లో బిగ్ బాస్ కు రికార్డ్ లెవల్లో టీఆర్ఫీ రేటింగ్ వచ్చింది. దీంతో అలాంటి కంటెస్టెంట్ ను మళ్లీ హౌస్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు నిర్వాహకులు.

అందుకే.. ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో బర్రెలక్కను కంటెస్టెంట్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. బర్రెలక్క రాకతో రూరల్ ఆడియన్స్ ను కూడా టార్గెట్ చేయొచ్చని యాజమాన్యం భావిస్తుంది. అదే జరిగితే బర్రెలక్క మరోసారి సోషల్ మీడియాలో మారుమోగిపోవడం ఖాయం. అందుకే యాజమాన్యం ఆమెను ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదే జరిగితే ఈసారి కూడా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ భారీగా పెరుగుతుంది.

Updated : 1 Jan 2024 7:33 PM IST
Tags:    
Next Story
Share it
Top