Home > క్రీడలు > ధావన్కు షాక్.. టీమిండియాలో దక్కని చోటు.. ఆ యంగ్స్టర్ను కెప్టెన్గా

ధావన్కు షాక్.. టీమిండియాలో దక్కని చోటు.. ఆ యంగ్స్టర్ను కెప్టెన్గా

ధావన్కు షాక్.. టీమిండియాలో దక్కని చోటు.. ఆ యంగ్స్టర్ను కెప్టెన్గా
X

టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ లో జరగబోయే ఏషియన్ గేమ్స్ కు భారత జట్టును ప్రకటించింది. ధవన్ సీనియారిటీకి గౌరవంగా.. ఏషియన్ గేమ్స్ కు సెలక్ట్ చేసి, కెప్టెన్సీ అప్పగిస్తారని భావించారంతా. కానీ, ఊహాగానాలకు తెర దించుతూ.. ఇన్ ఫామ్ లో ఉన్న బ్యాటర్ ధవన్ ను పక్కన బెట్టింది. ఇప్పటివరకు జరిగిన ఏ సిరీస్ లోనూ సెలక్ట్ చేయకపోగా.. సెప్టెంబర్ లో జరగబోయే ఏషియన్ గేమ్స్ కూ మొండిచేయి చూపించింది. శుక్రవారం (జులై 14) ఏషియన్ గేమ్స్ లో పాల్గొనే టీమిండియా జట్టు బీసీసీఐ ప్రకటించింది.

బీసీసీఐ ఏషియన్ గేమ్స్ లో కుర్రాళ్లకే పెద్దపీట వేసింది. రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమిస్తూ.. జట్టును ప్రకటించింది. ఐపీఎల్ లో రాణించిన యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది. ఈ నిర్ణయంతో ధావన్ అంతర్జాతీయ కెరీర్ దాదాపు ముగిసినట్లే అని భావిస్తున్నారు.

టీమిండియా జట్టు:

రుతురాజ్ గైక్వాడ్ (C), యశస్వీ జైశ్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (wk), వాషింగ్ టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్సిమ్రాన్ సింగ్ (wk)

స్టాండ్ బై ప్లేయర్స్: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంటకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్






Updated : 15 July 2023 2:40 PM IST
Tags:    
Next Story
Share it
Top