యూట్యూబ్లో రికార్డు సృష్టించిన బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ...సీని చరిత్రలోనే తొలిసారి
X
ప్రజల్లో సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా సోషల్ మీడియా..కరోనా టైంలో వచ్చిన ఓటీటీలు మూవీ పరిధులను చెరిపేస్తున్నాయి. బాష ఏదైనా సరే మూవీ హిట్ అయిన యావరేజ్ గా ఉన్నా దానితో సంబంధం లేకుండా ఆ సినిమాని చూసేస్తున్నారు మూవీ లవర్స్. ఇటు ఆడియన్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు ఇతర బాషల్లోకి మూవీలను డబ్ చేసి విడుదల చేస్తున్నాయి. అలా యూట్యూబ్‌లో విడుదలైన టాలీవుడ్ మూవీ ‘జయ జానకీ నాయక’ (Jaya Janaki Nayaka) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకూ ఏ ఇండియాలో ఏ చిత్రమూ సాధించని విధంగా..వంద కాదు, రెండ వందలు కాదు, ఏకంగా 800 మిలియన్ వ్యూస్‌తో ఇండియాలోనే అత్యధిక మంది యూట్యూబ్‌లో చూసిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా జయ జానకి నాయకా. ఈ మూవీని యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా...ఆగస్టు 2017లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. తెలుగులో యావరేజ్ గా నిలిచిన ఈ సినిమా యాక్షన్ ప్రియులను బాగా అలరించింది. ఈ క్రమంలో ‘పెన్ మూవీ’ సంస్థ ‘జయ జానకీ నాయక కోహినూర్’ అనే పేరుతో ఫిబ్రవరి 8, 2019న ఈ మూవీని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. యాక్షన్ మూవీలకు పెద్దపీట వేసే నార్త్ ఆడియన్స్..ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ లో ఈ మూవీ 800 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇది ఇలాగే తొందరల్లోనే బిలియన్ వ్యూస్ మార్క్ ను అందుకుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అటు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ కలిగిన పది సినిమాల్లో ఏడు తెలుగువే కావడం విశేషం. అంతేగాక అందులో మూడు చిత్రాలకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించడం గమనార్హం. ఫస్ట్ ప్లేస్ లో ‘జయ జానకీ నాయక కోహినూర్ (800 మిలియన్ వ్యూస్) ఉండగా, ఇక 772 మిలియన్ వ్యూస్ తో యశ్ నటించిన కేజీయఫ్ (KGF) రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో సీతారామ్ (తెలుగులో సీత మూవీ 643 మిలియన్ వ్యూస్ తో ఉంది. ఆ తర్వాత వరుసగా.. ది సూపర్ ఖిలాడీ (నేను శైలజ-588 మిలియన్ వ్యూస్), అ ఆ (549 మిలియన్ వ్యూస్), దమ్‌దార్ ఖిలాడీ (హలో గురు ప్రేమ కోసమే- 549 మిలియన్ వ్యూస్), సూర్య వంశం (అమితాబ్- 481 మిలియన్ వ్యూస్), డియర్ కామ్రేడ్ (391 మిలియన్ వ్యూస్), సరైనోడు (368 మిలియన్ వ్యూస్), మేడమ్ గీతా రాణి ( జ్యోతిక రాటచాయ్- 368 మిలియన్ వ్యూస్) పదిస్థానాల్లో టాప్ లో ఉన్నాయి.