బాలీవుడ్ స్టార్ హీరో ఇంటికి వెళ్లి మరీ రాఖీ కట్టిన బెంగాల్ సీఎం
X
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబైలో సందడి చేశారు. రక్షా బంధన్ సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బంగ్లా జల్సాను ఆమె సందర్శించారు. రెండు రోజుల పాటు జరిగే విపక్ష కూటమి ‘ఇండియా’ కీలక సమావేశంలో పాల్గొనేందుకు మమత బుధవారం ముంబై చేరుకున్నారు. ఈ సందర్భంగా మమత అమితాబ్‌కు రాఖీ కట్టారు. ముంబై పర్యటనలో భాగంగా బిగ్ బీ దీదీకి తేనీటి విందుకు ఇన్వైట్ చేసినట్లు తెలుస్తోంది. దీదీ అమితాబ్ కుటుంబ సభ్యులను కలుసుకుని వారితో కాసేపు సరదాగా ముచ్చటించి ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మీడియాతో దీదీ మాట్లాడుతూ "అమితాబ్ ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. రాఖీ సందర్భంగా బిగ్ బీకి రాఖీ కట్టాను. అమితాబ్ కుటుంబం అంటే నాకు అమితమైన ఇష్టం . ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసింది, దేశంలోనే నంబర్ వన్ గా నిలిచింది. బెంగాల్‌లో జరిగిన దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వారిని ఆహ్వానించాను . గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి అమితాబ్ హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలో ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు భారతరత్న అవార్డుతో సత్కరించాలి"అని దీదీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
#WATCH | Mumbai: West Bengal CM Mamata Banerjee speaks on her meeting with Bollywood actor Amitabh Bachchan at his residence.
— ANI (@ANI) August 30, 2023
"I am happy today. I met 'Bharat Ratan' of India Amitabh Bachchan (Mamata Banerjee called Bollywood actor Amitabh Bachchan Bharat Ratan) and also tied… pic.twitter.com/qoTsYbJVFH