Home > సినిమా > రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్యలో జాన్వీ కపూర్..ఏ జంట బెస్ట్?

రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్యలో జాన్వీ కపూర్..ఏ జంట బెస్ట్?

రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్యలో జాన్వీ కపూర్..ఏ జంట బెస్ట్?
X

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్‌తో ఈ మధ్యనే 'గేమ్ ఛేంజర్' సినిమా షూట్ ఫినిష్ చేశారు. ఇక ఇప్పుడు 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో ఆర్సీ16కి కొబ్బరికాయ కొట్టేశారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు జాన్వీ తండ్రి బోనీ కపూర్ కూడా వచ్చారు. మెగాస్టార్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి షూటింగ్ ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో జాన్వీకి లభించిన గౌరవం ఎన్టీఆర్‌తో చేస్తున్న దేవరకు లభించలేదని పలువురు మండిపడుతున్నారు. దేవర షూటింగ్ పూజా కార్యక్రమంలో డైరెక్టర్ కొరటాల శివను, హీరో తారక్‌ను మాత్రమే ఫోకస్ చేశారని, జాన్వీ గురించి టాక్ అంతగా బయటకు రాలేదనే మాట వినిపిస్తోంది. జాన్వీ కపూర్‌ను సైడ్ చేసి లాంచన కార్యక్రమాలు జరిగాయని అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ మూవీలో జాన్వీపై పెట్టిన స్పెషల్ ఫోకస్ చూసి అందరూ మెగా ఫ్యామిలీని మెచ్చుకుంటున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్..సంయుక్తంగా ఆర్సీ 16 మూవీని నిర్మిస్తున్నాయి. మార్చి 20న ఆర్సీ 16 మూవీ పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు, మూవీ యూనిట్‌తో పాటుగా డైరెక్టర్ సుకుమార్, మెగాస్టార్ చిరంజీవి, జాన్వీ తండ్రి బోని కపూర్, డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్, ఇంకా మరికొందరు సినీ పెద్దలు హాజరయ్యారు.

అందులో చరణ్, జాన్వీ పక్కపక్కనే ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ జంటను చూసి అప్పట్లో చిరంజీవి, శ్రీదేవిలు చేసిన జగదేకవీరుడు..అతిలోక సుందరి సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. చిరూ, శ్రీదేవి లాగే జాన్వీ, చరణ్ జంట క్యూట్‌గా ఉందంటున్నారు. మరోవైపు దేవర మూవీలో తారక్, జాన్వీ జంట అంతగా సెట్ కాలేదని, జాన్వీ ముందు తారక్ తేలిపోతున్నాడని పలువురు నెట్టింట చర్చించుకుంటున్నారు. ఈ విషయం తారక్ ఫ్యాన్స్‌కు అంతగా మింగుడుపడటం లేదు.

Updated : 23 March 2024 6:44 PM IST
Tags:    
Next Story
Share it
Top