Happy Birthday: భగవంత్ కేసరి నుంచి కాజల్ ఫస్ట్ లుక్
X
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దుమ్ములేపేందుకు సిద్ధమైంది. నిన్న మొన్నటి వరకూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. కాస్త బ్రేక్ ఇచ్చి పెళ్లి చేసుకొని, ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో భాగంగా.. బాలయ్య- అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భగవంత్ కేసరిలో నటిస్తున్నది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ బర్త్ డే విషేష్ చెబుతూ... ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. కాజల్ చీరలో ఫస్ట్ లుక్ పోస్టర్ లో హోమ్లీగా కనిపిస్తుంది. ఇక ఆమె సైకాలజీ పుస్తకం చదువుతూ.. ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తుంది. చిరునవ్వు మొహంతో.. స్పెక్ట్స్ పెట్టుకుని ఉంది. ఈ పోస్టర్ లో పోస్టర్ లో కాజల్ సైకాలజీ బుక్ చదువుతున్నట్లు కనిపించింది. ఆమె రూమ్ మొత్తం బుక్స్ తోనే నిండి ఉన్నాయి కాబట్టి ఆమె డాక్టర్ కానీ లాయర్ కానీ అయ్యే అవకాశం ఉంది. బాలయ్య సైకాలజీని చదివే డాక్టర్ గా కాజల్ కనిపిస్తుందేమో చూడాలి
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. దసరాకు సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే రెగ్యూలర్ షూటింగులు చేస్తోంది చిత్ర బృందం. అందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. మాస్ యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో కాజల్ సహా శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సి. రామ్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్లో కనిపించనున్నారని సమాచారం.