Home > సినిమా > Bhagavanth Kesari Movie: భగవంత్ కేసరి రెండో రోజు డౌన్ అయిందా..

Bhagavanth Kesari Movie: భగవంత్ కేసరి రెండో రోజు డౌన్ అయిందా..

Bhagavanth Kesari Movie: భగవంత్ కేసరి రెండో రోజు డౌన్ అయిందా..
X

భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ కిక్కే వేరు. అయితే ఆ నెక్ట్స్ మరో ప్రశ్న కూడా ఉంటుంది. ఈ మూవీస్ కలెక్షన్స్ ఎంత అని.. ? ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచి సెకండ్ డే కలెక్షన్స్.. వీకెండ్ వసూళ్లు అంటూ కొత్త కాలిక్యులేషన్స్ మొదలవుతాయి. అలా చూసుకుంటే రోరింగ్ స్టార్ బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ కూడా తెచ్చుకున్న ఈ మూవీ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఆకట్టుకునేలానే ఉన్నాయి.

బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ ఇంత త్వరగా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అఖండ, వీర సింహారెడ్డి మూవీస్ వంటి ఊరమాస్ ఎంటర్టైనర్స్ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా అంటే మాగ్జిమం ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ వస్తుందనుకున్నారు చాలామంది. అందుకు భిన్నంగా అటు మాస్ కాకుండా ఇటు కామెడీ కాకుండా ఓ బలమైన కథ చెప్పే ప్రయత్నంలో ఇద్దరి ఇమేజ్ లకు భిన్నమైన కంటెంట్ తో వచ్చారు. శ్రీ లీల సెంటర్ పాయింట్ గా సాగిన ఈ కథ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కొన్ని మైనస్ లు, మరికొన్ని అవుట్ డేటెడ్ సీన్స్ ఉన్నా కూడా .. ఈ తరహా పాత్రలో బాలయ్యను చూడ్డం జనాలకు నచ్చింది. అందుకే భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది భగవంత్ కేసరి. ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 32.33 కోట్లు వచ్చాయి. బాలయ్యకు ఇప్పటి వరకూ ఇదే హయ్యొస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం. అయితే ఇంత భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ మూవీ రెండో రోజు సడెన్ గా డ్రాప్ కావడం ఆశ్చర్యం. రెండో రోజు భగవంత్ కేసరి సాధించిన కలెక్షన్స్ 19.73 కోట్లు మాత్రమే. రెండు రోజుల కలెక్షన్స్ కలిపి 51.12 కోట్లు వచ్చాయన్నమాట. అంత పెద్ద ఓపెనింగ్స్ తెచ్చుకున్న మూవీ సడెన్ గా డౌన్ కావడం విశేషమే.

మొదటి రోజు బాలయ్యకు పోటీగా లియో ఉంది. రెండో రోజు రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఉంది. ఈ టైగర్ ప్రభావం మన లయన్ పై పడింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే టైగర్ ఓపెనింగ్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి. అంటే లియో, టైగర్ నాగేశ్వరరావు ప్రభావం కాకుండా భగవంత్ కేసరికి వచ్చిన రివ్యూస్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్స్ ను ప్రభావితం చేశాయి అనుకోవచ్చా.. అనుకోవచ్చు. అయినా ఈ రెండు సినిమాలూ బాలయ్యకంటే చాలా వెనకే ఉన్నాయి కాబట్టి దసరా బరిలో విన్నర్ గా భగవంత్ కేసరి నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనా బాలయ్య కెరీర్ ఈ మూవీ హయ్యొస్ట్ గ్రాసర్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి.

Updated : 21 Oct 2023 2:23 PM IST
Tags:    
Next Story
Share it
Top