Home > సినిమా > Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఇదే

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఇదే

Bhagavanth Kesari  :  భగవంత్ కేసరి ట్రైలర్ డేట్ ఇదే
X

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా భగవంత్ కేసరి. బ్రో.. ఐ డోంట్ కేర్ అనేది క్యాప్షన్. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ లో కనిపించబోతోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ గా నటించాడు. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ తో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు అనిల్ అనిపించుకున్నాడు. ఈ ఇద్దరి ఇమేజ్ లకు భిన్నమైన కథ, కథనాలతో రూపొందినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వచ్చిన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. భగవంత్ కేసరి పై ఎలా చూసినా.. భారీ అంచనాలున్నాయి. ఇక ఈ అంచనాలను మరింత పెంచేందుకు ట్రైలర్ తో రాబోతున్నాడు బాలయ్య.




ఈ నెల 8న భగవంత్ కేసరి ట్రైలర్ విడుదల చేయబోతున్నాడు. ఫస్ట్ టైమ్ బాలకృష్ణ తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పాడీ సినిమాలో. అందుకే ట్రైలర్ ను వరంగల్ లో విడుదల చేయబోతోంది టీమ్. ఈ ట్రైలర్ తర్వాత దసరా బరిలో ఉన్న సినిమాల మధ్య ఏ రేంజ్ పోటీ ఉండబోతోందనేది తెలిసిపోతుంది.

ఇక భగవంత్ కేసరి థమన్ సంగీతం అందించాడు. సి రాం ప్రసాద్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్.


Updated : 5 Oct 2023 5:55 PM IST
Tags:    
Next Story
Share it
Top