Home > సినిమా > Bharat Ratna Award : ఇప్పటివరకు ఎంతమందికి భారతరత్న అందుకున్నారో తెలుసా..?

Bharat Ratna Award : ఇప్పటివరకు ఎంతమందికి భారతరత్న అందుకున్నారో తెలుసా..?

Bharat Ratna Award   : ఇప్పటివరకు ఎంతమందికి భారతరత్న అందుకున్నారో తెలుసా..?
X

(Bharat Ratna Award) భారత రత్న.. దేశంలోని అత్యున్నత పురస్కారం. ఏదైన ఒక రంగంలో అసాధారణ ప్రతిభను కనబరిచిన వారికి కేంద్రం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. ఈ పురస్కారాన్ని బీజేపీ కురవృద్ధుడు ఎల్ కే అద్వానీకి ఇస్తున్నట్లు ప్రధాని మోదీ శనివారం ప్రకటించారు. దీంతో ఈ పురస్కారం అందుకున్న వారి సంఖ్య 50కి చేరింది. గత 10 రోజుల వ్యవధిలోనే కేంద్రం ఇద్దరికీ భారతరత్న ప్రకటించింది. అద్వానీ కంటే ముందు బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారత రత్న ప్రకటించింది.

2019లో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2019లో మొత్తం ముగ్గురికి కేంద్రం భారతరత్న ప్రకటించింది. భూపేంద్ర కుమార్‌ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు మరణానంతరం అవార్డును ప్రకటించింది. అయితే 2020 నుంచి 2023 వరకు ఎవరినీ ఎంపిక చేయలేదు. కాగా 1954లో భారతరత్న, పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. 55లో పద్మ అవార్డులను పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ కేటగిరీలుగా విభజించింది. ఇక తొలి భారతరత్న పురస్కారాన్ని 1954లో దేశ చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాల చారి అందుకున్నారు.

1954లోనే మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్ అందుకున్నారు. 1955లో ముగ్గురు భారత రత్నకు ఎంపిక అయ్యారు. కాశీ విద్యాపీఠం వ్యవస్థాపకులు భగవాన్ దాస్, ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూ ఈ అవార్డు అందుకున్నారు. 1957, 58 ఏడాదిల్లో ఇద్దరు ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. 57లో గోవింద్ వల్లభ్ పంత్, 58లో ధొండొ కేశవ కార్వే ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1961లో ఇద్దరు, 62 లో ఒక్కరు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

1961 - డా. బీ.సీ.రాయ్ (వెస్ట్ బెంగాల్ మాజీ సీఎం)

1961 - పురుషోత్తమ దాస్ టాండన్ ( స్వాతంత్ర్య సమరయోధుడు)

1962 - రాజేంద్ర ప్రసాద్( భారత తొలి రాష్ట్రపతి )

1963 - డా. జాకీర్ హుస్సేన్ (సంగీత విద్వాంసుడు, మూడో రాష్ట్రపతి )

1963 పాండురంగ వామన్ కానే (1880-1972) సంస్కృత పండితుడు

1963 - పాండురంగ్ వామన్ కానే ( సంస్కృత పండితుడు, చారిత్రక పరిశోధకుడు )

1966 - లాల్ బహదూర్ శాస్త్రి ( దేశ రెండో ప్రధాని )

1971 - ఇందిరా గాంధీ (దేశ మొదటి మహిళా ప్రధాని )

1975 - వీవీ గిరి ( భారత నాలుగో రాష్ట్రపతి)

1976 - కుమారస్వామి కామరాజ్ (స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళనాడు మాజీ సీఎం )

1980 - మదర్ థెరిసా ( నోబెల్ శాంతి బహుమతి గ్రహీత )

1983 - వినోబా భావే ( మహాత్మా గాంధీ ముఖ్య శిష్యుడు )

1987 - అబ్దుల్ గఫార్ ఖాన్ ( స్వాతంత్ర్య సమరయోధుడు, సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి )

1988 - ఎంజీ రామచంద్రన్ ( నటుడు, తమిళనాడు మాజీ సీఎం )

1990 - బీఆర్ అంబేద్కర్ ( రాజ్యాంగ రూపశిల్పి )

1990 - నెల్సన్ మండేలా ( సౌతాఫ్రికా అధ్యక్షుడు )

1991 - రాజీవ్ గాంధీ ( దేశ మాజీ ప్రధాని )

1991 - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ( స్వాతంత్ర్య సమర యోధుడు, తొలి హోంమంత్రి )

1991 - మొరార్జీ దేశాయ్ ( స్వాతంత్ర్య ఉద్యమకారుడు, దేశ 4వప్రధాని )

1992 - మౌలానా అబుల్ కలాం ఆజాద్ ( స్వాతంత్ర్య సమరయోధుడు, మొదటి విద్యా మంత్రి )

1992 - జేఆర్డీ టాటా ( పారిశ్రామికవేత్త )

1992 - సత్యజిత్ రే ( ఫిల్మ్ డైరెక్టర్ )

1997 - గుల్జారీలాల్ నందా ( ఆర్థికవేత్త, రాజకీయవేత్త )

1997 - అరుణా అసఫ్ అలీ ( ఢిల్లీ మేయర్‌గా ఎన్నికైన తొలి మహిళ.

1997 - అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి )

1998 - సుబ్బలక్ష్మీ ( సంగీత విద్వాంసురాలు )

1998 - చిదంబరం సుబ్రమణ్యం ( స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు )

1999 - జయప్రకాష్ నారాయణ్ ( స్వాతంత్ర్య సమరయోధుడు )

1999 - అమర్త్య సేన్ ( ఆర్థికవేత్త )

1999 - గోపీనాథ్ బోర్డోలోయ్ ( స్వాతంత్ర్య సమరయోధుడు, అస్సాం తొలి సీఎం )

1999 - రవి శంకర్ ( సితార్ విద్వాంసుడు )

2001 - లతా మంగేష్కర్ ( లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ )

2001 - బిస్మిల్లా ఖాన్ ( షెహనాయ్ విద్వాంసుడు )

2009 - భీమ్‌సేన్ జోషి ( ప్రసిద్ధ గాయకుడు )

2014 - సి.ఎన్.ఆర్. రావు ( ప్రముఖ రసాయన శాస్త్రవేత్త )

2014 - సచిన్ టెండూల్కర్ ( క్రికెటర్ )

2015 - అటల్ బిహారీ వాజ్‌పేయి ( రాజకీయ వేత్త, మాజీ ప్రధాని )

2015 - మదన్ మోహన్ మాలవీయ ( విద్యావేత్త, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు )

2019 - నానాజీ దేశ్‌ముఖ్ ( సామాజిక కార్యకర్త, ఆర్ఎస్ఎస్లో కీలక వ్యక్తి )

2019 - భూపేంద్ర కుమార్ హజారికా ( ప్రముఖ గాయకుడు, గీత రచయిత )

2019 - ప్రణబ్ ముఖర్జీ ( ప్రముఖ రాజకీయవేత్త, మాజీ రాష్ట్రపతి )

2024 - కర్పూరి ఠాకూర్ ( బిహార్ మాజీ సీఎం, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి )

2024 - ఎల్కే అద్వానీ ( బీజేపీ వ్యవస్థాపక సభ్యులు, మాజీ ఉప ప్రధాని )


Updated : 4 Feb 2024 9:33 AM IST
Tags:    
Next Story
Share it
Top