Home > సినిమా > మెగా ఫ్యాన్స్‌కి డబుల్ కిక్.. 'భోళా శంకర్‌' ట్రైలర్‌ డేట్ ఫిక్స్

మెగా ఫ్యాన్స్‌కి డబుల్ కిక్.. 'భోళా శంకర్‌' ట్రైలర్‌ డేట్ ఫిక్స్

మెగా ఫ్యాన్స్‌కి డబుల్ కిక్.. భోళా శంకర్‌ ట్రైలర్‌ డేట్ ఫిక్స్
X

మెహర్ రమేష్ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా భోళా శంకర్ (Bhola Shankar). ఈ సినిమాకు సంబంధించి ఓ వైపు షూటింగ్ వర్క్స్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్నారు మేకర్స్. తాజాగా మెగా అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్ చెప్పారు. భోళా శంకర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. జూలై 27న భోళా శంకర్ ట్రైలర్ లాంచ్ చేస్తున్నామని మెహర్ రమేష్ చెప్పారు.

జూలై 27న భోళా శంకర్ ట్రైలర్ వస్తుండగా.. జూలై 28న పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలసి నటించిన BRO సినిమా విడుదల కాబోతోంది. దీంతో మెగా అభిమానులకు ఇది డబుల్ కిక్ అయింది. దీంతో ఈ నెలాఖరున ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనీ ఇప్పటినుంచే ప్లాన్స్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సినిమాలో మెగాస్టార్ జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ (Keerthi Suresh) కనిపించనుంది.

తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ కూడా నటిస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నాడు.


Updated : 23 July 2023 12:50 PM IST
Tags:    
Next Story
Share it
Top