OTT :ఓటీటీలోకి భోళా శంకర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?
X
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. తమిళ వేదాళంకు రీమెక్గా మెహర్ రమేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో రెండో రోజు నుంచే థియేటర్స్ వెలవెలబోయాయి. చాలా థియేటర్స్లో మూడో రోజు నుంచే ఈ మూవీని తీసేసి జైలర్ సినిమా వేశారు. నేటి ట్రెండ్ను పట్టించుకోకుండా తమిళంలో ఎనిమిదేళ్ల క్రితం రిలీజ్ అయిన వేదాళం మూవీని రీమేక్ చేయడమే ఈ సినిమాకు పెద్ద మైనస్ అనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో రీలీజ్ కానుంది.
భోళా శంకర్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందు అనుకున్న డేట్ కంటే ముందుగానే ఈ మూవీని స్ట్రీమ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15నుంచే ఈ సినిమా నెటిఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కాగా అగస్ట్ 11న రిలీజైన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించగా.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలుగా యాక్ట్ చేసింది. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో నటించారు. థియేటర్లో దారుణ రిజల్ట్ ఎదుర్కొన్న ఈ మూవీకి ఓటీటీలో అయిన ప్రేక్షకులు కనికరిస్తారా అన్నది వేచి చూడాలి.