Home > సినిమా > Bhola Shankar twitter Review: ఖుషి 'సీన్' ఎక్సెలెంట్.. భోళా శంకర్ ట్విట్టర్ రివ్యూ..

Bhola Shankar twitter Review: ఖుషి 'సీన్' ఎక్సెలెంట్.. భోళా శంకర్ ట్విట్టర్ రివ్యూ..

Bhola Shankar twitter Review: ఖుషి సీన్ ఎక్సెలెంట్.. భోళా శంకర్ ట్విట్టర్ రివ్యూ..
X

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన 'భోళా శంకర్' (Bhola Shankar) ఫస్ట్ టాక్ వచ్చేసింది. తమిళ సినిమా 'వేదాళం' స్ఫూర్తితో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున భారీ ఎత్తున విడుదలైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడ్డాయి. అమెరికాతో పాటు మరికొన్ని ఓవర్సీస్ లొకేషన్లలో సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ లో రివ్యూలు, పోస్టులు పెడుతున్నారు. అక్కడి టాక్ ఎలా ఉంది? సినిమాలో పాజిటివ్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి? అని చూస్తే... కొంత మంది సినిమా బాగుందని అంటుంటే.. ఇంకొంత మంది ఒకసారి చూడొచ్చు పర్లేదు అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా భోళా మేనియా మాత్రం నెట్టింట్లో కనిపిస్తోంది.





కామెడీ సీన్స్ అన్నీ సెట్.. ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్.. సెకండ్ హాఫ్ బాస్ తెలంగాణ యాసలో ఇంకా సూపర్.. ఖుషీ సీన్‌లో బాస్ ఇరగ్గొట్టేశాడు..సెంటిమెంట్‌తో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ, ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్నీ బాగున్నాయ్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని తొలిసారి చిరంజీవి ఇమిటేట్ చేశారు. 'భోళా శంకర్'లో పవన్ తరహాలో చిరంజీవి చేసిన సీన్ అభిమానులను అలరిస్తుందని ఓవర్సీస్ ఆడియన్స్ చెబుతున్నారు. ఇక, శ్రీముఖితో చిరు చేసిన 'ఖుషి' నడుము సీన్ స్పూఫ్ వచ్చిన సమయంలో థియేటర్లలో అరుపులు, కేకలే వినిపించాయి.

ఎలాంటి హైప్ లేకుండా వెళ్తే డీసెంట్ హిట్ అనిపిస్తుంది.. బాస్ లుక్స్.. బీజీఎం గురించి అయితే అడక్కండి.. దారుణంగా ఉంది.. ఖుషీ సీన్ బాగుంది.. ఓవరాల్ బ్లాక్ బస్టర్ భోళా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. చిరు కామెడీ టైమింగ్, కీర్తి సురేష్ సిస్టర్ సెంటిమెంట్.. తమన్నా పర్పామెన్స్.. డ్యాన్స్.. సినిమాను చూసేలా చేస్తాయి.. మహతి పాటలు అద్భుతంగా ఉన్నాయి.. ఓవరాల్ డీసెంట్ హిట్.. బాస్ తన కామెడీ టైమింగ్‌లో ఎప్పుడూ బెస్టే.. మెహర్ అద్భుతంగా తీశాడు.. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే.. సినిమా అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంది.. ఫైనల్లీ గుడ్ వాచ్ అంటూ ఇలా మెగా అభిమానులు అంతా కూడా సినిమా మీద పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారు. చిరు లుక్స్, కీర్తి సురేష్ అద్భుతంగా ఉన్నారు.. . సినిమా రొటీన్ అని, సెకండాఫ్ సినిమాను నిలబెడుతుందని కొందరు అంటున్నారు.మొత్తానికి నెగెటివ్ కామెంట్లు కూడా ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి. కానీ మెజార్టీ మాత్రం సినిమా ఒక్కసారి చూడొచ్చు అని సలహాలు ఇస్తున్నారు.








Updated : 11 Aug 2023 7:16 AM IST
Tags:    
Next Story
Share it
Top