Home > సినిమా > పూనకాలు లోడింగ్ అంటున్న ఫ్యాన్స్

పూనకాలు లోడింగ్ అంటున్న ఫ్యాన్స్

పూనకాలు లోడింగ్ అంటున్న ఫ్యాన్స్
X

చిరు ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే టైమ్ వచ్చేసింది. మెగాస్టార్ నటించిన భోళాశంకర్ సినిమా ట్రైలర్ విడుదల అయిపోయింది. వాల్తేరు వీరయ్యకు ఏమో తెలియదు కానీ ఈ సినిమా ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అన్నట్టు ఉంది. తనయుడు రామ్ చరణ్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మూవీ టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మించిన సినిమా భోళాశంకర్. చిరంజీవి, తమన్నీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈమూవీలో కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా చేసింది. ఇప్పటికే ఈ సినిమాలో సాంగ్స్, టీజర్ లు పాపులర్ అయ్యాయి. ఇప్పుడు విడుదల అయిన ట్రైలర్ కూడా హై వోల్టేజ్ తో ఉంది. చిరు పాత సినిమాలను తలపిస్తోంది. మెగాస్టార్ లోని ఫుల్ మాస్ ఎనర్జీని ఈ సినిమాలో చూడొచ్చని అనిపిస్తోంది.భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల అవనుంది. దీనికి మహతి స్వరసాగర్ మ్యూజిక్ ను అందించారు.

Updated : 27 July 2023 4:42 PM IST
Tags:    
Next Story
Share it
Top