Home > సినిమా > BiggBoss7: అప్‌డేట్ అదిరిపోలా..బిగ్ బాస్ హౌజ్‌లోకి అప్పటి లవర్ బాయ్

BiggBoss7: అప్‌డేట్ అదిరిపోలా..బిగ్ బాస్ హౌజ్‌లోకి అప్పటి లవర్ బాయ్

BiggBoss7: అప్‌డేట్ అదిరిపోలా..బిగ్ బాస్ హౌజ్‌లోకి అప్పటి లవర్ బాయ్
X

90 కిడ్స్‎కు అబ్బాస్ గురించి స్పెషల్‎గా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, విలన్‎గా, లవర్ బాయ్‎గా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు అబ్బాస్. అబ్బాస్ ప్రేమ్ దేశం సినిమా అప్పట్లో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో అబ్బాస్‎కు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. ఇదే మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో అబ్బాస్ చేసి ప్రేక్షకుల హృదయాలను దోచేశాడు. అమ్మాయిల కలల రాకుమారుడు మారాడు. రాజహంస, రాజా, నీ ప్రేమకై, అనగనగా ఒక అమ్మాయి, కృష్ణబాబు, శ్వేతనాగు, నరసింహ, అనసూయ ఇలా దాదాపు 50 సినిమాల్లో అబ్బాస్ నటించాడు. కెరీర్ మంచి పీక్స్‎లో ఉన్నప్పుడే ఎందుకో ఏమో 2015 నుంచి ఆయన ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయారు. రీసెంట్‎గా చెన్నై వచ్చిన అబ్బాస్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే అబ్బాస్‎కు సంబంధించి మరో లేటెస్ట్ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‎గా వ్యవహరిస్తున్న

బిగ్ బాస్ హౌజ్‌లోకి ఈ ప్రేమ దేశం హీరో రాబోతున్నాడంటూ వస్తున్న వార్త అందరిలో ఆసక్తి రేపుతోంది.





బిగ్ బాస్7 సీజన్‎లో ప్రేమదేశం హీరో అబ్బాస్ కంటెస్టెంట్‎గా వస్తున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇక అబ్బాస్‎కి పెద్ద బూస్ట్ అనే చెప్పాలి. 1990ల్లో ప్రేమదేశం వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీతో స్టార్‏డమ్ సంపాదించిన అబ్బాస్.. మరికొన్ని సినిమాలతోనూ పాపులర్ అయినా తర్వాత క్రమంగా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ తెరకు దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత అతడు బిగ్ బాస్ లాంటి ఫేమస్ షో ద్వారా వస్తే మాత్రం అతని కమ్‌బ్యాక్ ఓ రేంజ్‎లో అదిరిపోతుందనే చెప్పాలి. ఇప్పటికే నాగార్జున బిగ్ బాస్ 7వ సీజన్ ప్రోమోలను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈసారి అంతా ఉల్టా పుల్టా, కుడి ఎడమైతే అంటూ నాగార్జున అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ సీజన్‎లో హౌజ్‎లోకి నటి సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రితతో పాటు , జబర్దస్త్ కమెడియన్ నరేష్ లాంటి వారు వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.





ఇక అబ్బాస్ విషయానికి వస్తే..చాలా ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న అబ్బాస్ త‌న కుటుంబంతో సహా న్యూజిలాండ్‌లో స్థిర‌ప‌డ్డారు.ఈ మధ్యనే ఇండియాకు వచ్చిన అబ్బాస్ తన కెరీర్ గురించి ఆస‌క్తిక‌రమైన విష‌యాలను తెలిపారు. ఇప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్‎గా వస్తున్నారనడంతో 90 కిడ్స్‎లో ఓ కొత్త ఊపు వచ్చింది. అబ్బాస్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు వాస్తవం అని అనేది మాత్రం నాగ్ కంటెస్టెంట్ లిస్టును అనౌన్స్ చేసే వరకు చూడాల్సిందే.




Updated : 24 Aug 2023 2:16 PM IST
Tags:    
Next Story
Share it
Top