బ్రేకప్‌తో నరకం అనుభవించా...నటి రోహిణి
X
టీవీ నటి రోహిణి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టీవీ సీరియల్స్ తో తన కెరీర్ ప్రారంభించి యాంకరింగ్ తో కామెడీ సెన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరపై రోహిణి చేసే పెర్ఫార్మెన్స్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన టాలెంట్ తో బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. ఓ వైపు జబర్దస్త్ కామెడీ షోలో తన కామోడీతో నవ్విస్తూనే పలు కార్యక్రమాల్లో హోస్ట్ గా సినిమాల్లో నటిగా తన కెరీర్ లో ముందుకు వెళ్తోంది. ఈ మధ్యనే రోహిణి కాలికి సర్జరీ చేయించుకుంది. కొద్ది రోజులు బుల్లితెరకు దూరంగా ఉంటోంది. ఇప్పుడిప్పుడే కాస్త రికవర్ అయిన రోహిణి మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా ఓ షోలో రోహిణ తన బ్రేకప్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యింది. లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్ల తాను అనుభవించిన మనోవేధనను పంచుకుంది.
షోలో రోహిణి మాట్లాడుతూ.."నాకు ఒకప్పుడు బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు. కొన్ని విభేదాల కారణంగా మేము బ్రేకప్ అయ్యాము. బ్రేకప్ తర్వాత నేను చాలా నరకం అనుభవించా. ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ సమయంలో నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు. వారు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. అసలు వాడెవడు, నీ కాలి గోటికి కూడా సరిపోడు అని నాకు ధైర్యాన్ని చెప్పారు. వారిచ్చిన ధైర్యంతోనే నేడు అప్పుడు వాడు ఆఫ్ట్రాల్ గాడు.. వీడి గురించి ఇంతలా ఆలోచించడం ఏంటని నన్ను నేను ప్రశ్నించుకున్నా. అలా అతని జ్ఞాపకాల నుంచి దూరం అయ్యాను. ఎతో కష్టం మీద స్నేహితుల సపోర్ట్‌తో బ్రేకప్ డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అంటూ చెప్పుకొచ్చింది రోహిణి. ఇలా హటాత్తుగా రోహిణి తన బ్రేకప్ గురించి చెప్పడంతో నెటిజన్లు రోహిణి ప్రేమించిన వ్యక్తి ఎవరని ఆరా తీయడం మొదలుపెట్టారు.