Home > సినిమా > బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యావర్

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యావర్

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన యావర్
X

తెలుగు నుంచి బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ మాత్రమే అని అందరికీ తెలుసు. గత కొన్ని సీజన్స్ యావరేజ్ అనిపించుకున్నా.. ఈ సారి మాత్రం తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందించారు కంటెస్టెంట్స్. ఉల్టాపుల్టా అంటూ నాగార్జున చేసిన హోస్టింగ్ సైతం ఈ సారి మరింత ఎక్కువగా ఆకట్టుకుంది. ఇక కంటెస్టెంట్స్ మధ్య కూడా మంచి పోటీ కనిపించింది. స్పై, స్పా బ్యాచెస్ గా విడిపోయినా.. ఎవరి ఫ్యాన్ బేస్ వారికి స్టార్ట్ అయింది. మా టివి బ్యాచ్ పై అనేక విమర్శలున్నా.. బిగ్ బాస్ నిర్వాహకులు వారిని చివరి వరకూ కొనసాగించారు. గత వారం మోస్ట్ కాంట్రవర్శీయల్ అనిపించుకున్న శోభ ఎలిమినేట్ అయింది. ఇక ఈ శనివారం శోభ, అర్జున్ తో పాటు యావర్ కూడా ఎలిమినేట్ అయ్యారు. చివరగా ఆదివారం పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ మాత్రం నిలుస్తున్నారు. ఈ ముగ్గురిలో కూడా ప్రశాంత్, అమర్ మధ్యే విన్నర్, రన్నర్ ఉండబోతోంది.

ఇక షో చివరకి వచ్చేసింది. ఈ ఆదివారంతో బిగ్ బాస్ సీజన్ 7 ముగిసిపోతుంది. చివర్లో నిలిచిన కంటెస్టెంట్స్ కు సంబంధించి బరిలో నిలుస్తారా లేక బిగ్ బాస్ ఆఫర్ చేసిన అమౌంట్ తీసుకుని వెళ్లిపోతారా అనే పాయింట్ ఉంటుంది. గతంలో సోహైల్ ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. ఈ సారి యావర్ 15 లక్షలు తీసుకుంటావా.. ఫైనల్స్ వరకూ ఉంటావా అనే బిగ్ బాస్ ఛాలెంజ్ లో 15లక్షలకే ఓటు వేశాడు. ఆ డబ్బుతో అతను ఈ శనివారమే ఎలిమినేట్ అయ్యాడు. సో.. యావర్ కు తన కంటెస్టెంట్ రెమ్యూనరేషన్ తో పాటు ఈ 15లక్షలు అదనంగా వస్తుంది.

Updated : 16 Dec 2023 7:39 PM IST
Tags:    
Next Story
Share it
Top