Home > సినిమా > సెప్టెంబరులో రిలీజ్ అవుతున్న భారీ సినిమాలు ఇవే..!

సెప్టెంబరులో రిలీజ్ అవుతున్న భారీ సినిమాలు ఇవే..!

సెప్టెంబరులో రిలీజ్ అవుతున్న భారీ సినిమాలు ఇవే..!
X

సినీ ప్రియులకు సెప్టెంబర్ నెల పండగ కానుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఈ సినిమా నుంచి 7కు పైగా పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. అంతేకాదు సెప్టెంబర్ 18న వినాయక చవితి వస్తుండటంతో 15వ తేదీనే ఏకంగా మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. అవేంటో చూద్దాం..

క్లాసిక్ లవ్ స్టోరీ ‘ఖుషి’:

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో.. శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఖుషి. ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవికుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అంచనాలకు మించిన ‘జవాన్’:

పఠాన్ సక్సెస్ తర్వాత రాబోతున్న షారుఖ్ ఖాన్ సినిమా జవాన్. కోలీవుడ్ డైరెక్టర్ ఆట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నయనతార, దీపికా పదుకోన్ ఇందులో మెయిన్ లీడ్. ఈ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.


నవ్వులు పూయించే ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’:



నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు పి. డైరెక్షన్ లో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

రామ్, బోయపాటి మాస్ యాక్షన్:

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ సినిమా స్కంద. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 15న రిలీజ్ అవుతుంది. అఖండను మించిన యాక్షన్ ఈ సినిమాలో ఉంటుందని చిత్ర బృందం ముందే ప్రకటించింది.

కీరవాణి సంగీతంతో.. హారర్ సినిమా:

రజనీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా చంద్రముఖి. దీనికి సీక్వెల్ గా రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ జోడిగా తెరకెక్కకుతోంది చంద్రముఖి-2. ఈ సినిమాను పి.వాసు డైరెక్ట్ చేస్తున్నాడు.

విశాల్ ఎక్స్ పరిమెంట్ తో..:

సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.. మార్క్ ఆంథోని సినిమాతో ఈసారి హీరో విశాల్ ప్రయోగం చేస్తున్నాడు. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషించారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 15న వస్తుంది. విశాల్ కు జంటగా రీతూవర్మ నటిస్తుంది.

మోస్ట్ అవైటెడ్.. పాన్ ఇండియా సినిమా:

ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్. ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తోంది. కాగా ట్రైలర్ ను సెప్టెంబర్ 3న విడుదల చేయడంకోసం సిద్ధం చేస్తున్నారు.




Updated : 27 Aug 2023 4:11 PM IST
Tags:    
Next Story
Share it
Top