Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఈ సారి..
X
బిగ్ బాస్ 7లో మరో ఎలిమినేషన్కు సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు 9మంది ఎలిమినేట్ అవ్వగా.. రతిక తిరిగి బిగ్ బాస్లోకి వచ్చింది. ప్రస్తుతం 10వ వ్యక్తిని ఎలిమినేట్ చేసే టైం వచ్చేసింది. ఈ సారి రతిక ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా కదా.. అందుకే ఎలిమినేషన్లో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా రతికలో ఎటువంటి ఛేంజ్ లేదు. సేమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది.big twist in bigg boss 7 telugu elimination
ఎలిమినేషన్కు ముందు ప్రశాంత్‌తో పులి హోర కలిపిన రతిక ఈసారి ప్రిన్స్‌ను తన బుట్టలో వేసుకుంది. దీనివల్ల రతికకు కలిసిరావడం పక్కనబెడితే యావర్ ఆట మాత్రం దొబ్బిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం రతికను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అటు ఫ్యామిలీ వీక్ లోనూ రతికకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే టాక్ ఉంది. దీంతో ఆమె ఎలిమినేట్ అవడం పక్కా అనుకున్నారు అంతా. కానీ మరో కీలక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ వారం భోలే షావళి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. భోలే తన ఆటకంటే పాటలతోనే అదరగొడుతున్నాడు. అప్పటికప్పుడు పాటలను అల్లుతూ పాడడడంతో జనాలు సైతం ఫిదా అవుతున్నారు. అయితే ఈ వారం ఆయనకు తక్కువ ఓట్లు వచ్చినట్లు సమాచారం. దీంతో హౌస్ నుంచి బయటకు వెళ్తాడనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే భోలేకు తక్కువ ఓట్లు పడ్డాయా.. రతికను కాపాడుకోవడానికి భోలెను బలి చేశారా..? అనేది తెలియాల్సి ఉంది. అయితే దివాళి సందర్భంగా ఎలిమినేషన్ ఉండదనే ప్రచారమూ లేకపోలేదు. ఒకవేళ ఉంటే మాత్రం భోలే ఎలిమినేట్ అవడం ఖాయంగా కాన్పిస్తోంది.